ఈ ఆలయంలో విగ్రహం స్వయంభుగా వెలిసింది. ఈ ఆలయంలోనే ఓ పెద్ద పుట్ట కూడా ఉంది. పుట్టకు ఆనుకొని శివుడు సుబ్రహ్మణ్యస్వామి నాగబంధం విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతిరోజు మాదిరిగానే అర్చకుడు ఉదయాన్నే ఆలయానికి వెళ్లారు. అక్కడ విగ్రహానికి విభూదితో అభిషేకం చేస్తున్నారు. ఈ సమయంలో శివుని కుడి కన్ను తెరిచి ఉన్నట్టు కనిపించింది. దీంతో అవాక్కైనా అర్చకులు.. పూజలు చేశారు. విషయాన్ని స్థానికులకు చెప్పారు. విషయం తెలుసుకొని ఆ దృశ్యాన్ని చూసేందుకు తరలివస్తున్నరు భక్తులు. స్వామివారి దర్శనానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి తమ పూజలు చేస్తున్నారు. గాజువాక నియోజకవర్గం ఆటోనగర్ యాదవ జగ్గరాజుపేట వెళ్లే మార్గంలో ఉన్న ఆలయంలో ఈ వింత చోటుచేసుకుంది. అయితే శివయ్య కుడి కన్ను తెరవడం గ్రామానికి అదృష్టమని కొంతమంది చెబుతుంటే.. అరిష్టమనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే.. విభూది అభిషేకం సమయంలో కంటి పై ఆకారం అలా ఏర్పడి ఉంటుందని మరికొందరు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
300 అడుగుల ఎత్తులో తలకిందులుగా ఉద్యోగి.. చివరకు..
బాబోయ్.. కొత్త రకం డయాబెటీస్.. ఎవరికి వస్తుందో తెలుసా?
ఈత కొడుతున్న గబ్బిలం.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
అరే.. ఎవర్రా నువ్వు.. చలివేంద్రం లో ఇదేం పనిరా.. సైలెంట్ గా వచ్చి..
రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైన కుర్చీ.. ఆ తర్వాత ??