
పహల్గామ్లో ఉగ్రవాదుల అమానుష చర్య భారత్‌తోపాటు ప్రపంచాన్నే ఉలిక్కి పడేలా చేసింది.. మతాన్ని అడిగి.. వెతికి మరీ, గుర్తు పట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్ముకశ్మీర్ కనీవినీ ఎరుగని వికృతమైన ఉగ్రవాద దాడిలో మొత్తం 28 మంది చనిపోయారు.. ఈ ఘాతుకంపై ఆసేతుహిమాచలం కుతకుత ఉడికిపోతోంది. పహల్గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాల్సిందే.. అంటూ రగిలిపోతోంది.. అయితే.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది బాధితుల ప్రాథమిక పరీక్షలో ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి.. బయటకు వచ్చిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదులు మతాన్ని అడిగి దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.. మరణించిన 26 మందిలో.. దాదాపు 20 మంది పురుషుల ప్యాంటు జిప్ తీయడం లేదా.. ప్యాంటు క్రిందికి లాగినట్లు అధికారులు కనుగొన్నారు.. టూరిస్టులపై కాల్పులు జరిపే ముందు.. మతాన్ని గుర్తించడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నం ఇది అని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
వేరే మతాన్ని లక్ష్యంగా హత్యలు చేసే ముందు.. బాధితుల మతాన్ని గుర్తించడానికి.. ఉగ్రవాదులు ఇలా చేశారని ఆర్మీ సిబ్బంది, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, స్థానిక పరిపాలన అధికారులతో కూడిన ఉమ్మడి బృందం విశ్వసిస్తోంది. మృతుల కుటుంబాలు తీవ్ర షాక్‌లో ఉండవచ్చు.. కానీ మృతదేహాలను వెలికితీసిన సిబ్బంది వాటిని కవర్లతో కప్పి ఉంచారంటూ నివేదికలో తెలిపింది..
ఉగ్రవాదులు పర్యాటకుల గుర్తింపు కార్డులను కూడా తనిఖీ చేసి, ఇస్లామిక్ పద్యం.. కల్మాను పఠించమని బలవంతం చేశారు . అలా చేయని వారిని – వారు ముస్లింలు కాదని సూచిస్తూ – కాల్చి చంపారు.
ఎఫ్ఐఆర్ కోసం వివరాలను నమోదు చేయడానికి మృతదేహాలను నిశితంగా పరిశీలించే పనిలో ఉన్న అధికారుల బృందం ఈ క్రూరమైన మతపరమైన ప్రొఫైలింగ్ సంకేతాలను గుర్తించింది.. సున్నతి కోసం తనిఖీ చేయడానికి లోదుస్తులను లాగినట్లు కూడా ఇందులో ఉంది.
ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఈ పరిశోధనలను ధృవీకరిస్తున్నాయి.. పహల్గామ్ ఊచకోతకు కారణమైన ఉగ్రవాదులు బాధితులను చంపే ముందు వారి మతపరమైన గుర్తింపును ధృవీకరించారని నిర్ధారించాయి. దాడిలో పాల్గొన్నవారు ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు వంటి గుర్తింపు పత్రాలను చూపించాలని డిమాండ్ చేశారని, బాధితులను కల్మా (ఇస్లామిక్ విశ్వాసం – ప్రకటన) పఠించమని ఆదేశించారని.. సున్నతి చేయించుకున్నారా..? లేదా చూడడానికి వారి లోదుస్తులను తొలగించమని కూడా బలవంతం చేశారని బాధితులు తెలిపారు.. ఇది సాధారణంగా ముస్లిం పురుషులతో ముడిపడి ఉన్న ఆచారం.
ఉగ్రవాదులు ఈ మూడు ‘పరీక్షల’ ద్వారా హిందూ గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత.. వారు వారిని చాలా దగ్గరగా కాల్చి చంపారు. మంగళవారం జరిగిన దాడిలో మరణించిన 26 మంది పురుషులలో 25 మంది హిందువులుగా గుర్తించి .. కాల్పులు జరిపి చంపారని అధికారులు పేర్కొన్నారు..
కాగా.. పహల్గామ్ ఊచకోతపై దర్యాప్తు వేగం పుంజుకుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) అధికారులతో కూడిన సంయుక్త బృందం ప్రస్తుతం ట్రాల్, పుల్వామా, అనంతనాగ్, కుల్గాం వంటి ప్రాంతాల నుండి దాదాపు 70 మంది ఉగ్రవాద సానుభూతిపరులను విచారిస్తున్నట్లు భద్రతా సంస్థల వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో, దాదాపు 1,500 మంది జాబితాను సిద్ధం చేశారు.. ఈ జాబితాను ఇప్పుడు 70 మంది వ్యక్తులకు కుదించారు.. వారు పహల్గామ్ దాడి బృందానికి లాజిస్టికల్ మద్దతు అందించారని బలంగా అనుమానిస్తున్నారు.. ఇదిలాఉంటే.. ఉగ్రవాదుల ఏరివేతకు.. భద్రతా బలగాలు.. అన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..