అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం వార్తలు కలకలం రేపుతున్నాయి. హార్స్లీ హిల్స్ వెళ్లిన పర్యాటకులకు రోడ్డు దాటుతూ చిరుత కనిపించింది. దీంతో పర్యాటకులకు భయపడిపోయారు. టూరిస్టులకు చిరుత కనిపించిందన్న వార్తలతో స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతేడాది ఫిబ్రవరిలోనూ మూడు చిరుతలు రోడ్డు దాటుతూ కనిపించడం కలకలం రేపింది. అయితే వేసవి కావటంతో ఆహారం, దప్పికలతో అడవి నుంచి వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

హార్స్లీ హిల్స్ అటవీ ప్రాంతంలో ఓ చిరుత రోడ్డు దాటుతూ పర్యాటకులకు కనిపించింది. దీంతో స్థానికులు, హార్స్లీ హిల్స్ చూడ్డానికి వచ్చే వారు కలవరపడుతున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో భయాందోళనకు గురౌతున్నారు. గతేడాది ఫిబ్రవరిలోనూ హార్స్లీ హిల్స్ అటవీ ప్రాంతంలో చిరుతలు కనిపించాయి. ఒకేసారి మూడు చిరుతలు రోడ్డుపైకి రావటంతో అప్పట్లో స్థానికులు భయపడిపోయారు. ఇప్పుడు మరోసారి చిరుత సంచారం నేపథ్యంలో పర్యాటకులు, స్థానికులు కలవరపడుతున్నారు.
హార్స్లీ హిల్స్ అడవిలో చిరుత సంచారం.. టూరిస్టులూ బీ అలర్ట్..!
పచ్చని అడవులు, చల్లని వాతావరణం ఉండే హార్స్లీహిల్స్కు వేసవి సీజన్లో పర్యాటకుల రద్దీ ఉంటుంది. ఈ నేపథ్యంలో చిరుత సంచారం నేపథ్యంలో సందర్శకులు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే వేసవి కావటంతో ఆకలి దప్పికల కారణంగా వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
ఏనుగుల దాడిలో రైతు మృతి
మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగులు పేట్రేగిపోయాయి. ఏనుగుల దాడిలో ఓ కౌలు రైతు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్లలో పొలం నుంచి ఇంటికెళ్తున్న సిద్ధయ్య అనే రైతుపై ఏనుగు దాడి చేసింది. కిందపడేసి తొక్కడంతో సిద్ధయ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి స్వస్థలం దాసరిగూడెంగా తెలిసింది. ఏనుగు దాడి నేపథ్యంలో రెండు ఏనుగులను అటవీ శాఖ సిబ్బంది అడవిలోకి తరిమేశారు. అయితే ఈ ఘటనతో ఆ ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు.