మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, కుజ, రవుల అనుకూలత వల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ వారు, రాజకీయ నాయకులు ఆశించిన ప్రతిఫలాలు పొందుతారు. వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ద పెడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. పిల్లలు చదువుల్లో పైకి వస్తారు. జీవిత భాగస్వామికి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడితో పాటు శని, బుధులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి ఈ వారమంతా ఆదాయానికి లోటుండకపోవచ్చు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితముంటుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. ఆస్తి, ఆర్థిక వివాదాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రాశివారు దుర్గా స్తోత్రాన్ని పఠించడం అవసరం.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశినాథుడు బుధుడు దశమ స్థానంలో తన మిత్ర గ్రహంతో కలిసి ఉండడం వల్ల, రవి లాభ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, బాధ్యతలు పెరగడం, జీతభత్యాలు వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించవచ్చు. అత్యంత ప్రముఖులతో కూడా పరిచయాలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివార్చన చేయించడం లాభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం వృద్ధి చెంద డమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక అవసరాలు చాలావరకు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు దాదాపు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా, అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. తరచూ గణపతిని ప్రార్థించడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అయితే, వృథా ఖర్చులు అదుపు తప్పుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడులుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదే శాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర, బుధులు, భాగ్య స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా అనుకూల పరిస్థితులుంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల మీద బాగా శ్రద్ధ పెట్టడం అవసరం. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల లాభాలు కలుగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛలో ఉండడం, ఈ రాశిని ఉచ్ఛలో ఉన్న రవి వీక్షించడం వంటి అనుకూలతల వల్ల ఈ రాశివారికి ఈ వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితం బిజీగా గడిచిపోతుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఈ రాశివారు సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశి అధిపతి కుజుడు భాగ్య స్థానంలో ఉండడం ఒక అనుకూలత కాగా, గురువు సప్తమ స్థానంలో ఉండడం మరో అనుకూలత. ఈ రెండింటి వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందడంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత కఠినంగా ఉండడం మంచిది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలు కొద్ది శ్రమతో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. స్కంద స్తోత్రం పఠించడంమంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయ టపడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ పరిస్థితులు ఇబ్బంది కలిగి స్తాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. తరచూ శివార్చన చేయించడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి వివాదం పరిష్కార మార్గం పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందివస్తాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. శివార్చన చేయించడం చాలా మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ప్రస్తుతం ఈ రాశివారికి ధన స్థానం, కుటుంబ స్థానం బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలను వసూలు చేసుకుంటారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తిలో రాబడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. తరచూ లలితా సహస్రనామ స్తోత్ర పఠనం వల్ల మేలు కలుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశిలో ప్రస్తుతం శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఏలిన్నాటి శని దోషం నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. జీతభత్యాలు, పదోన్నతులకు సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల మేలు జరుగుతుంది.