పుచ్చకాయ వేసవిలో లభించే ఒక పండు. ఇందులో చాలా పోషకాలున్నాయి. అధిక నీటి శాతం కూడా ఉంటుంది. దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. పుచ్చకాయను తినడం వలన వెంటనే తాజాదనం ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే పుచ్చకాయ మాత్రమే కాదు, దాని విత్తనాలతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే ఈ విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఈ రోజు పుచ్చకాయ గింజలను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. అంతేకాదు దీనిలో విటమిన్లు, ఇనుము వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇక పుచ్చకాయ గింజల్లో జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడే రోగులకు ఇది చాలా మేలు చేస్తుంది.
పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
మెరుగైన జీర్ణవ్యవస్థ
పుచ్చకాయ గింజల్లో పొటాషియం అలాగే అధిక ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు పుచ్చకాయ గింజలు జీర్ణవ్యవస్థకు కూడా చాలా ప్రయోజనకరం. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి.
ఇవి కూడా చదవండి
మెరిసే చర్మం
చర్మ సమస్యలు ఉన్నవారు లేదా కొల్లాజెన్ లోపంతో బాధపడేవారు ఖచ్చితంగా పుచ్చకాయ గింజలను తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్ ఉన్నాయి. ఇవి చర్మ కాంతిని పెంచుతాయి.
బలమైన రోగనిరోధక శక్తి
వ్యక్తి రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటుందనేది పూర్తిగా శరీరంలోని జింక్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. కనుక పుచ్చకాయ గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. జింక్ రోగనిరోధక కణాలను బలోపేతం చేయడానికి అలాగే వాటిని చురుకుగా ఉంచడానికి పనిచేస్తుంది. తద్వారా మీరు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉంటారు.
ఆరోగ్యకరమైన కొవ్వులు
మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. గుండెపోటు, స్ట్రోక్‌ను నివారిస్తాయి. మొత్తం ఆరోగ్యానికి అవసరమైన ఆరోగ్యకరమైన లిపిడ్లు పుచ్చకాయ గింజలలో ఉన్నాయి.
నాడీ వ్యవస్థ
పుచ్చకాయ గింజల్లో విటమిన్ బి ఉంటుంది. ఇది మన నాడీ వ్యవస్థ, మెదడు పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎవరైనా చిత్తవైకల్యం లేదా ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతుంటే.. ఈ విత్తనాలను తాము తినే ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఎంత మొత్తంలో తీసుకోవాలంటే
పుచ్చకాయ గింజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కనుక పుచ్చకాయ గింజలను పారవేయకుండా.. తినే ఆహారంలో చేర్చుకోవాలి. అయితే మితంగా తినడం చాలా ముఖ్యం. రోజుకు 30 గ్రా. పుచ్చకాయ గింజలను మించి తినొద్దు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)