ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పవచ్చు అంటారు పెద్దలు.. అదే విధంగా సమాజంలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యమైంది. మన పురాణ గ్రంథాలలో కూడా స్త్రీల పాత్ర, స్త్రీల గుణగణాలను గొప్పగా చెప్పారు. అదే విధంగా
పండితుడు, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, రాజకీయ వేత్త అయిన ఆచార్య చాణక్యుడు కొన్ని వందల ఏళ్ల క్రితం స్త్రీల స్వభావం గురించి అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో చెప్పాడు. అతి సున్నితంగా కనిపించే స్త్రీలు దైర్యానికి ప్రతి రూపం అని.. వీరిలో అపారమైన శక్తి ఉందని పేర్కొన్నాడు.
తన కుటుంబంలో అనుకోని సంక్షోభం ఎదురైతే తన భర్త, పిల్లలు, కుటుంబం, వంశాన్ని రక్షించే గుణం స్త్రీల సొంతం అని చెప్పాడు. ఇటువంటి మహిళలు రాజ్యానికి, సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు. దేశాభివృద్ధికి ప్రత్యేక సహకారాన్ని అందిస్తారని ఆచార్య చాణక్య తెలిపాడు.
అంతేకాదు స్త్రీల లక్షణాలు గురించి ఇంకా చెబుతూ . చైవ కామశ్చాష్టగుణం: స్మృత: అంటే పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువ ఆకలి ఉంటుందని.. స్త్రీలు పురుషులకంటే ఎక్కువ ఆహారం తింటారని చెప్పాడు. అదే విధంగా వినయం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నాడు.
ఇక పురుషుల కంటే స్త్రీలు స్వతహాగా సిగ్గరులని వీరిలో సిగ్గు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట. ధైర్యం ఆరు రెట్లు ఎక్కువ..కామం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పాడు చాణక్యుడు.
ఇంకా స్త్రీ లక్షణాల గురించి చెబుతూ మహిళలు మధురమైన మాటలు మాట్లాడాలని చెప్పాడు. స్త్రీలు వాడే బాషతోనే సమాజంలో వాతావరణం ఉంటుందని చెప్పాడు. స్త్రీ ఎప్పుడూ తప్పుడు భాషని ఉపయోగించ రాదని.. ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే మహిళల ఆలోచనలో స్వచ్ఛత లోపిస్తుందని చాణక్యుడు అన్నాడు.
మాట అదుపులేని స్త్రీలు అధిక ఒత్తిడికి గురయ్యి.. మనసుపై మెదడుపై ప్రభావం చూపించి తీవ్ర వ్యాధులతో బాధపడతారని పేర్కొన్నాడు.
కనుక స్త్రీలు మాటని అదుపు చేసుకునే నేర్పు కలిగి ఉండాలని.. మంచి మాటలే మాట్లాడాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ chanakya niti, acharya chanakya, chanakya niti in telugu, women qualities, women good qualities, women bad qualitiesక్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు