MI vs LSG and DC vs RCB Preview and Prediction: ఐపీఎల్ (IPL) 2025 ఏప్రిల్ 27 ఆదివారం డబుల్ హెడర్ జరగనుంది. ఈ రోజు రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబైలో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. రెండో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. రెండు మ్యాచ్‌లు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఈ సీజన్ ముంబై ఇండియన్స్‌కు చాలా చెత్తగా ప్రారంభమైంది. మొదటి ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ముంబై ఇప్పుడు తిరిగి విజయాల ట్రాక్‌లోకి వచ్చింది. దీంతో చివరి నాలుగు మ్యాచ్‌లలోనూ విజయాన్ని రుచి చూసింది. ముంబై జట్టు లక్నోపై కూడా తమ విజయ పరంపరను కొనసాగించాలని కోరుకుంటోంది. మరోవైపు లక్నో ప్రదర్శన కూడా ఇప్పటివరకు బాగుంది. లక్నో జట్టు 9 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది.
MI vs LSG హెడ్ టు హెడ్ గణాంకాలు..
ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో లక్నో పైచేయి సాధించింది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగగా, లక్నో 6 సార్లు గెలిచింది. కాగా, ముంబై ఒకే ఒక మ్యాచ్ గెలిచింది.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ జట్టు పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఈ జట్టు టోర్నమెంట్లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. అదే సమయంలో బెంగళూరు ప్రదర్శన కూడా ప్రశంసనీయం. బెంగళూరు జట్టు 9 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగలిగింది. ఇప్పుడు ఆదివారం రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.
DC vs RCB గణాంకాలు..
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 32 సార్లు తలపడ్డాయి. ఈ కాలంలో బెంగళూరు ఢిల్లీని 19 సార్లు ఓడించగా, ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
నేటి మ్యాచ్‌లో గెలుపు ఎవరిది?
ముందుగా ముంబై వర్సెస్ లక్నో మధ్య జరిగే మ్యాచ్‌లో ముంబై పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. ముంబై జట్టు అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌ను సొంతగడ్డపై ఆడబోతున్నారు. కాబట్టి, ముంబైని ఓడించడం లక్నోకు కష్టం. రెండవ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బెంగలూరును ఓడించగలదు. ఈ సీజన్లో ఢిల్లీ జట్టు ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఆర్సీబీని 6 వికెట్ల తేడాతో ఓడించింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..