అక్కినేని నాగ చైతన్య గతేడాదే రెండోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. శోభిత ధూళిపాళ్లతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలాగే సినిమాల పరంగా తండేల్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. నాగ చైతన్య కుటుంబ సభ్యులతో తప్పితే పెద్దగా ఎవరితోనూ కలవడు. అతని ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువే. అందులో ఈ యూట్యూబర్ రవి తేజ కూడా ఒకరు. తెలుగు టాప్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్స్ లో ఒకటైన స్ట్రీట్ బైట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఛానెల్ లోనే గత 12 ఏళ్లుగా ఉంటున్నాడు రవితేజ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫుడ్స్, రెస్టారెంట్స్ గురించి తన సబ్ స్క్రైబర్లకు చెబుతున్నాడు. ఇదే రవితేజని నాగ చైతన్యతో కలిపింది. చాలామంది హీరోల్లాగే నాగచైతన్యకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే కరోనా సమయంలో షోయు అనే ఓ క్లౌడ్ కిచెన్ స్థాపించాడు. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇటీవలే స్కుజి అనే పేరుతో మరో క్లౌడ్ కిచెన్ సెంటర్ ను ప్రారంభించాడు. . ప్రస్తుతం ఈ రెండూ క్లౌడ్ కిచెన్ సెంటర్స్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే రెస్టారెంట్ ఫుడ్ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య – రవితేజ్ కలిశారు. ఇటీవలే నాగచైతన్య కొత్త క్లౌడ్ కిచెన్ సెంటర్ స్కూజి ని ప్రమోట్ చేస్తూ రవితేజ్ ఒక వీడియో చేసాడు. ఇదే సందర్భంగా నాగచైతన్య గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు రవి. ‘ నాగ చైతన్య నాకు మంచి ఫ్రెండ్. ఇటీవల బాబు పుట్టిన సమయంలో కష్టాల్లో ఉంటే చైతూ ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికి పిలిచి రెండు గంటల సేపు మాట్లాడి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు’ అని నాగ చైతన్యతో తనకున్న అనుబంధాన్ని బయట పెట్టాడు రవి. ఇక నాగచైతన్య కూడా మాట్లాడుతూ.. రవి తినే విధానం, రవి బిజినెస్, వీడియోలు తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
నాగచైతన్యోతో రవితేజ రావూరి..
పవర్ స్టార్ పవర్ కల్యాణ్ తో రవితేజ రావూరి..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .