జయపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీ లీల. అదే సమయంలో బాలీవుడ్ లోనూ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ తో శ్రీలీలకు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. ఇదే క్రమంలో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఈసారి కూడా ఒక హిందీ స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది. శ్రీలీల స్పీడ్ చూస్తుంటే రష్మిక మందన్న లాగా ఆమె కూడా బాలీవుడ్లో పాగా వేస్తుందో లేదో చూడాలి . ‘డ్రీమ్ గర్ల్’ ఫేమ్ రాజ్ శాండిల్య కొత్త చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. శ్రీలీల, అనన్య పాండేలతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే శ్రీలీలకే మెయిన్ హీరోయిన్ గా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ‘డ్రీమ్ గర్ల్’ సినిమాను కామెడీ స్టైల్లో తీశారు. దర్శకుడు రాజ్ ఈ రకమైన సినిమాలతోనే ఎక్కువగా హిట్లు కొట్టాడు. ఇప్పుడు రాబోయే సినిమాలో కూడా కామెడీ ప్రధానంగానే ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందుకే శ్రీలీల, అనన్య పాండేలతో చర్చలు జరుగుతున్నాయి.
శ్రీలీల ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్లో న కనిపిస్తోంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేంగా జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. యాదృచ్ఛికంగా రష్మిక, సిద్ధార్థ్ గతంలో ‘మిషన్ మజ్ను’ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు.
ఇవి కూడా చదవండి
#Sreeleela and #AnanyaPanday in advanced talks to star opposite #SidharthMalhotra in a full-on commercial entertainer directed by #RaajShaandilyaa, produced by #MahaveerJain & #MrighdeepSinghLamba.
Casting to be finalized soon.#RaajShaandilyaa #MahaveerJain #BollywoodNews… pic.twitter.com/fs70Y3zttD
— Siddharth R Kannan (@sidkannan) April 27, 2025
ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. శ్రీలీల ప్రస్తుతం మాస్ మహారాజాతో కలిసి మాస్ జాతర అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దీంతో పాటు పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు శ్రీలీల చేతిలో ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.