సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అందం, అభినయంతో సినీ పరిశ్రమను ఏలేస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఓవైపు ఆమె నటించిన చిత్రాన్ని భారీ విజయాన్ని అందుకుంటున్నా.. పలు కారణాలతో నిత్యం వార్తలలో ఉంటుంది త్రిష. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్, లియో వంటి హిట్స్ తర్వాత త్రిష క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు అజిత్ సరసన విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంది. ‘జోడి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన తర్వాత మౌనం పెసియాదే మూవీతో హీరోయిన్గా గుర్తింపు పొందింది. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవల్లో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా మారింది.
నివేదికల ప్రకారం త్రిష ఆస్తులు రూ.85 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట. అలాగే బ్రాండ్ ఎండార్సమెంట్స్, ప్రమోషన్స్ ద్వారా త్రిష సంపాదిస్తుంది. త్రిష చెన్నైలోని ప్రతిష్టాత్మక ప్రాంతంలో ఒక అందమైన, విలాసవంతమైన బంగ్లాను కలిగి ఉంది. అన్ని ఆధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇంట్లో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. హైదరాబాద్లోని కూడా ఆస్తి ఉందని సమాచారం.
ఇక త్రిష వద్ద మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, BMW 5 సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్ వంటి అధునాతన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ కార్లు వారి స్టార్డమ్, ఆర్థిక స్థితిని మరింత హైలైట్ చేస్తాయి. త్రిష చేతిలో ప్రస్తుతం అనేక భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చిరంజీవి జోడిగా విశ్వంభర, కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రాల్లో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..