అక్షయ తృతీయ పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ బుధవారం ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం అక్షయ అంటే ఎప్పటికీ నాశనం కానిది. అందుకే ఈ రోజున స్వయంసిద్ధ ముహూర్తం లేదా దోషాలు లేని రోజు అని కూడా పిలుస్తారు. ఈ రోజున చేసే ఏదైనా శుభ కార్యం ఫలితాలు చాలా కాలం పాటు ఉంటాయని హిందువులకు నమ్మకం.
లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అక్షయ తృతీయ తిధి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతేకాదు కొన్ని పరిహారాలను పాటించడం వలన కూడా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు అక్షయ తృతీయ రోజున ఏం చేయాలో తెలుసుకుందాం.
ఇంట్లో లక్ష్మీ దేవిని ఎలా ఆహ్వానించాలంటే
- మంత్ర జపం: సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభయో నమః’ అని జపించాలి.
- పరిశుభ్రత: లక్ష్మీదేవి శుభ్రమైన ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. కనుక ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం ముఖ్యం.
- స్వస్తిక్ : ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపుతో స్వస్తిక్ ను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు.
- దీపం: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. లక్ష్మీ దేవి అక్కడ నివసిస్తుంది.
- గోమతి చక్రం: అక్షయ తృతీయ రోజున 11 గోమతి చక్రాలను పసుపు వస్త్రంలో పెట్టి.. గట్టిగా కట్టి వాటిని భద్రపరచడం వల్ల సంపద పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి
అక్షయ తృతీయకు ముందు ఈ వస్తువులను ఇంటికి తీసుకురండి
జ్యోతిషశాస్త్రం ప్రకారం అక్షయ తృతీయకు ఒక రోజు ముందు ఇంటికి చీపురు తెచ్చుకుని.. పూజ సమయంలో చీపురును ఉంచుకోండి. హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. పూజలో చీపురును ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని.. ఇంటికి శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు.
అక్షయ తృతీయకు ఒక రోజు ముందు ఇత్తడి పాత్రలను ఇంటికి తీసుకురండి. ఇత్తడిని విష్ణువు , బృహస్పతికి సంబంధించినదిగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున మీరు ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తే, అది జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది. ఆర్థిక లాభాలను కూడా తెస్తుంది.
అక్షయ తృతీయకు ఒక రోజు ముందు వెండి నాణెం లేదా వెండి పాత్రను తీసుకురండి. జ్యోతిషశాస్త్రంలో వెండిని చంద్రుడు, శుక్ర గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవి పూజలో వెండి నాణేలు, పాత్రలను ఉపయోగించండి. లక్ష్మీ దేవికి వెండి పాత్రలో బియ్యంతో చేసిన పాయసాన్ని నివేదన చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు