ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు మరే టీమ్ సాధించలేని అరుదైన రికార్డును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్లతో అగ్రస్థానానికి చేరిన ఆర్సీబీ, 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. అలాగే ఢిల్లీపై సాధించిన విజయంతో ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. అదేంటంటే.. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు మరే టీమ్ కూడా వరుసగా 6 అవే మ్యాచ్‌ల్లో విజయం సాధించలేదు. కానీ, తొలి సారి ఆ రికార్డును ఆర్సీబీ సాధించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన అన్ని అవే గేమ్స్ అంటే ప్రత్యర్థి హోం గ్రౌండ్లో ఆడిన అన్ని మ్యాచ్‌లను గెలిచింది.
మొత్తం 10 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు ప్రత్యర్థి హోం గ్రౌండ్లో, 4 మ్యాచ్‌లో తమ హోం గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడింది. ఆ 4లో మూడు మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ, 6 అవే గేమ్స్‌లో ఒక్కటి కూడా ఓడిపోకుండా.. 6కి 6 వరుసగా గెలిచింది. కేకేఆర్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో, సీఎస్కేను చెపాక్ స్టేడియంలో, ముంబైని వాంఖడేలో, రాజస్థాన్‌ను జైపూర్‌లో, పంజాబ్‌ను చండీఘర్‌లో, ఢిల్లీని ఢిల్లీలో ఓడించింది. ఇప్పటి వరకు ఇలా మరే టీమ్‌కు కూడా ప్రత్యర్థి హోం గ్రౌండ్స్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలివలేదు. అలా చేసిన మొట్టమొదటి టీమ్ ఆర్సీబీనే.
ఇక ఢిల్లీతో జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగుల సాధించింది. కేఎల్ రాహుల్ 41, అభిషేక్ పొరెల్ 28, స్టమ్స్ 34 పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 3, హెజల్‌వుడ్ 2 వికెట్లతో రాణించారు. స్పిన్నర్లు సుయాష్, కృనాల్ మిడిల్ ఓవర్స్‌లో చాలా పొదుపుగా బౌలింగ్ చేసి డీసీని కట్టిపడేశారు. అది ఆర్సీబీకి చాలా హెల్ప్ అయింది. చివర్లో స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. ఇక 163 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఊహించని షాకిచ్చాడు. ఇకే ఓవర్లో ఓపెనర్ జాకబ్ బెతెల్, దేవదత్ పడిక్కల్‌ను అవుట్ చేసి చావు దెబ్బ కొట్టాడు.
ఆ వెంటనే 4వ ఓవర్లో కెప్టెన్ రజత్ పాటిదార్ రన్ అవుట్ అవ్వడంతో ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ, ఒక ఎండ్‌లో విరాట్ కోహ్లీ క్రీజ్‌లో పాతుకుపోవడం, అనూహ్యంగా అప్ ది ఆర్డర్లో వచ్చిన కృనాల్ పాండ్యా ఆరంభంలో ఇబ్బంది పడినప్పటికీ.. ఆ తర్వాత అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీకి 4వ వికెట్‌కు 120 పరుగులకే పైగా అద్బుతమైన పార్నర్‌షిప్ రావడంతో గెలుపు ఈజీ అయిపోయింది. మొత్తంగా 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 165 పరుగులు చేసి విజయం సాధించింది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
6 Away wins on the trot. Never done before. 😤
We will continue to #PlayBold. ⚡️#ನಮ್ಮRCB #IPL2025 #DCvRCB pic.twitter.com/4S0RE0ixnd
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 28, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..