సమ్మర్లో బయటకు వెళ్లకుండా, ఇంట్లోనే కూల్ కూల్‌గా చల్ల చల్లని మ్యాంగో లస్సీ ఎలా తయారు చేసుకోని తాగండి. దీంతో మీ దాహం తీరడమే కాకుండా చాలా కూల్‌గా ఉంటారు. మరి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మ్యాంగో లస్సీ కోసం, ఒక కప్పు బాగా పండిన మామిడిపండ్ల గుజ్జు, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పాలు, మూడు టేబుల్ స్పూన్ల చక్కెర, యాలకుల పొడి, కొన్ని ఐస్ ముక్కలు. రెడీగా పెట్టుకోవాలి.
తయారీ విధానం.. కప్పు మామిడిపండ్ల గుజ్జును మిక్సీజార్‌లో వేసుకొని, పెరుగు, పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి బాగా గ్రైండ్ చేయాలి. దీని తర్వాత చల్లదనం కోసం ఐస్ ముక్కలు వేసుకొని, గ్రైండ్ చేసుకోవాలి. దీంతో చల్లచల్లటి మ్యాంగో లస్సీ రెడీ.
ఈ మ్యాంగో లస్సీ సమ్మర్ లో తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అందువలన తప్పకుండా వేసవికాలంలో మ్యాంగో లస్సీ తాగాలంటారు వైద్య నిపుణులు. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ తాగడం శరీరానికి చాలా మంచిది.