అందాల ముద్దుగుమ్మ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.ఎప్పుడూ బుల్లితెరపై తన మాటలతో, పంచ్ డైలాగ్స్‌తో సందడి చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఈ బ్యూటీ. ఎక్కువగా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్‌లో కనిపిస్తూ తన యాంకరింగ్‌తో అందరినీ ఆక్టుకుంటుంది.
రష్మీ జబర్ధస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సుడిగాల సుధీర్‌తో ప్రేమాయణం అంటూ వీరిద్దరి లవ్ డ్రామా తో మంచి ఫేమ్ వచ్చింది. అంతే కాకుండా షోలలో వీరిద్దరు కలిసి చేసే స్కిట్స్, డ్యాన్స్ ఫర్మామెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వీటిని చూసిన కొందరు నిజంగా వీరు ప్రేమలో ఉన్నారంటూ అనేక పుకార్లకు తెరలేపారు. కానీ సుధీర్, రష్మీ చాలా సార్లు మేము ఇద్దరం మంచి స్నేహితులం.. అని స్టేజ్ వరకే అని చెప్పు కొచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఎప్పుడూ వరస షోలతో ఫుల్ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఏ కాస్త సమయం దొరికినా సరే వెకేషన్‌కు వెళ్ల తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు తన స్నేహితులతో కలిసి మండుటెండల నుంచి ఉపశమనం కోసం ఇండోనేషియాలోని బాలీకి వెళ్లింది. అక్కడ పలు ప్రాంతాల్లో తన స్నేహితులతో కలిసి ఫుల్‌గా ఏంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వరస ఫొటో షూట్ తో అభిమానులను ఎంటర్టైన్ చేసే ఈ చిన్నది వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
మరీ ముఖ్యంగా రష్మీ ఈ మధ్య ఏదో ఆపరేషన్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే వెకేషన్ ఏంజాయ్ చేస్తున్నానంటూ.. ట్యాబ్ లేట్స్ ను కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది.