నగలు కొంటే జీఎస్టీ 3 శాతం తరుగు అదనం. ఈ లెక్కన 10 గ్రాముల శ్రీవారి డాలర్ ను టిటిడి వద్ద కాకుండా జ్యువెలరీ షాపుల్లో కొంటే దాదాపు 1,12,900 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఏప్రిల్ 22న ఉన్న ధర ప్రకారం 10 గ్రాముల బంగారం ధర 92,900 రూపాయలు కాగా 18 శాతం తరుగు కింద 1.8 గ్రాముల మేర అదనపు సొమ్ముతో పాటు 3 శాతం జీఎస్టీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల శ్రీవారి డాలర్ కోసం 1,12,910 రూపాయల వరకు జ్యువెలరీ షాపుల్లో చెల్లించక తప్పదు. అదే టిటిడి విక్రయ కేంద్రం వద్ద అయితే 10 గ్రాముల శ్రీవారి డాలర్ 90,671 రూపాయలకే లభిస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్ల విక్రయ కేంద్రంలో మంగళవారం టిటిడి విక్రయిస్తున్న డాలర్ల ధరను పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రంలో 2, 5, 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లను విక్రయిస్తున్న టిటిడి వాటిని భక్తులకు అందుబాటులో ఉంచింది. బులియన్ మార్కెట్లో ఉన్న రోజువారీ ధరతో సంబంధం లేకుండా టిటిడి భక్తులకు శ్రీవారి బంగారు డాలర్లను విక్రయిస్తుంది.