
అలాంటి కల్తీ పన్నీర్ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పన్నీర్ తో వంటలు చేసుకొని తినాలనిపించినప్పుడు మార్కెట్లో కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ ని తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. కల్తీ మోసపు నుంచి తప్పించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని టెస్ట్ ల ద్వారా ఫేక్ పన్నీర్ ను సులువుగా గుర్తించొచ్చు. అందులో మొదటి టెస్ట్ ఏంటంటే పన్నీర్ ని తాకి చూడాలి. ప్రెస్ చేసి చూసినప్పుడు నిజమైన పన్నీర్ అయితే వెంటనే ముక్కలైపోతుంది. స్టార్చ్ లేదా సింథటిక్ పదార్థాలను కలిపిందైతే ప్రెస్ చేసినా అలాగే ఉంటుంది తప్ప ముక్కలు కాదు. పైగా రబ్బరును తాకిన ఫీల్ వస్తుంది. నిజమైన పన్నీర్ పాల లాంటి టేస్ట్ ని కలిగి ఉంటుంది. నోకిలిది పుల్లగా ఉంటుంది. పన్నీర్ లో కొన్ని చుక్కలు అయోడిన్ వేస్తే అది నీలం రంగులోకి మారితే స్టార్చ్ కలిపినట్టే.