మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురవాలని ఒక పెద్ద యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగం జరిగే ప్రదేశానికి ఏప్రిల్ 24న శాస్త్రవేత్తల బృందం చేరుకుంది. ఈ యాగం ఏప్రిల్ 24 న మొదలైంది. ఈ రోజు అంటే ఏప్రిల్ 29 వరకు నిర్వహిస్తున్నారు. ఈ యాగం చేయడం వలన వర్షంపై ఎంత ప్రభావం చూపుతుంది? అనే విషయాన్ని తెలుసుకోవడానికి, శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేస్తుంది. ఈ మేరకు శాస్త్రవేత్తల బృందం ఆలయానికి చేరుకుని అధ్యయనం చేయడం మొదలు పెట్టారు.
మధ్యప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , సైంటిఫిక్ కౌన్సిల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండోర్ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ IITM లు ఒక పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించాయి.
పరిశోధన ప్రాజెక్ట్ ప్రారంభం
సోమవల్లి.. దీనిని సోమలత అని కూడా అంటారు. ఈ మొక్క హిందువులు ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ ఔషధ మొక్క సోమవల్లి (సార్కోస్టెమ్మ బ్రీవిస్టిగ్మా, ఒక రకమైన ఒలియాండర్) రసాన్ని సోమ యజ్ఞం (హవన) లో అగ్నికి సమర్పిస్తారు. ఇలా చేయడం ప్రభావవంతంగా ఉంటుందో లేదో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ఇది పర్యావరణాన్ని శుభ్రపరుస్తుంది. అవపాతానికి దారితీసే మేఘాల సంగ్రహణను నిరోధించగలదు.
ఇవి కూడా చదవండి
25 మంది పూజారులు
ఏప్రిల్ 24 నుంచి 29 వరకు జరిగిన ఈ యాగంలో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 25 మంది పూజారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఈ యాగం నిర్వహించడానికి వచ్చారు. ఈ యాగం జరిగే సమయంలో శాస్త్రవేత్తల బృందం యాగం నుంచి వెలువడే వాయువు, ఉష్ణోగ్రత, తేమలో మార్పులు, ఏరోసోల్ ప్రవర్తన, మేఘాల సంక్షేపణం (మేఘాలు గాలిలో నీటి ఆవిరి చల్లబడినప్పుడు ఏర్పడతాయి దీనిని సంక్షేపణ అంటారు) వంటి అనేక పారామితులను అధ్యయనం చేసింది. హవన సమయంలో అగ్ని జ్వాలల నుంచి వెలువడే కణాలను పరిశీలించడానికి శాస్త్రవేత్తలు సైనిక పరికరాలను ఉపయోగించారు. ఈ సమయంలో వాతావరణంలో ఏర్పడే ఏవైనా మార్పులను పసిగట్టడానికి ప్రయత్నించారు.
వర్షపాత నమూనాలపై ప్రభావం
ఇటువంటి యాగాలు వర్షపాత నమూనాపై ఏదైనా ప్రభావం చూపగలవో లేదో తెలుసుకోవడమే శాస్త్రవేత్తల పరిశోధన లక్ష్యం. గత సంవత్సరం కూడా ఇలాంటి యజ్ఞమే జరిగింది. ఈ సారి వేదమూర్తి అధ్వర్యు ప్రణవ్ కాలే, శౌనక్ కాలే, బ్రహ్మ యశ్వంత్ తాలేకర్, ఉద్గత ముకుంద్ జోషి, గణేష్ కులకర్ణి సహా 25 మంది అర్చకులు ఈ సోమ యాగాన్ని నిర్వహించారు. దీని తరువాత, మే 8 నుంచి మే 13 వరకు దేవఘర్ , ద్వారకలలో కూడా ఆచారాలు నిర్వహించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..