మన దేశంలో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖశాంతులు, ఐశ్వర్యంతో జీవిస్తామని నమ్మకం. శ్రేయస్సు, విజయానికి చిహ్నంగా భావించే అక్షయ తృతీయ ను ఉత్తరాదిలో అఖతీజ్ అని పిలుస్తారు. బంగారంతో పాటు ఇతర విలువైన లోహాలు, భూములు, ఆస్తులను కూడా ఇదే రోజు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
అక్షయ తృతీయ సందర్భంగా వివిధ ఫిన్ టెక్ ప్లాట్ ఫాంలు డిజిటల్ బంగారం కొనుగోలుపై ఆఫర్లు ప్రకటించాయి. వీటి ద్వారా ప్రజలు తక్కువ సొమ్ముతో కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. దీనిలో భాగంగా ఫోన్ పే, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. పండగ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి. సాధారణంగా బంగారు దుకాణానికి వెళితే సుమారు రూ.20 వేలు పెడితే గానీ ఉంగరం రాదు. కానీ డిజిటల్ విధానంలో రూ.రెండు వేలకు కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు.
ఫోన్ పే ప్రత్యేక ఆఫర్
- పండగ సందర్బంగా ఫోన్ పే ప్రత్యేక ఆఫర్ తీసుకువచ్చింది. 24కే డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేవారికి క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన కనీసం రూ.2 వేల విలువైన డిజిటల్ బంగారం కొనుగోలు చేసిన వారికి రూ.2 వేల వరకూ క్యాష్ బ్యాక్ అందజేయనుంది. అయితే ఈ ఆఫర్ ఒక్కసారి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. వాలెట్లు, గిఫ్ట్ కార్డులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఏ, యూపీఐ లైట్ తదితర వాటి ద్వారా కొనుగోళ్లు జరపొచ్చు.
- ఫోన్ పే కారాటేన్ స్టోర్లలో, వారి డిజిటల్ వైబ్ సైట్ డిజిటల్ బంగారాన్ని రీడిమ్ చేసుకోవడానికి కింద తెలిపిన ప్రత్యేక డీల్ ను అందజేస్తోంది. దాని ప్రకారం..
- బంగారు నాణేలపై అదనంగా రెండు శాతం తగ్గింపు
- స్డడ్ లు కాని ఆభరణాలపై అదనంగా మూడు శాతం తగ్గింపు.
- స్డడ్ లు ఉన్న ఆభరణాలపై అదనంగా 5 శాతం తగ్గింపు.
- ఎంఎంటీసీ, పీఏఎంపీ, సేఫ్ గోల్డ్, కారాట్లేన్ తదితర కంపెనీల నుంచి 99.99 శాతం స్వచ్ఛత కలిగిన 24కే డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు.
ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు
ఎయిల్ టెల్ పేమెట్స్ బ్యాంకు తన డిజీగోల్డ్ సేవను సెలవు పెట్టుబడి ఎంపికగా ప్రమోట్ చేసింది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను ఉపయోగించి 24కే 99.5 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. చిన్న డినామినేషన్లలో కూాడా కొనవచ్చు. ఇది బీమా చేసిన వాల్ట్ లలో నిల్వ చేస్తారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..