వాట్సాప్ తన వినియోగదారుల సౌలభ్యం కోసం ఏదో ఒక ఫీచర్‌ను పరీక్షిస్తూనే ఉంది. చాలా మంది వాట్సాప్‌ను దుర్వినియోగం చేస్తారు. లేదా అనుకోకుండా లింక్‌పై క్లిక్ చేస్తారు. దీని ఫలితంగా వారి ఖాతా బ్లాక్ అవుతుంది. మెటా వాట్సాప్ పాలసీకి విరుద్ధంగా ఉంటే ఖాతా బ్లాక్ అవుతుంది. లేదా నిషేధిస్తుంది వాట్సాప్ కంపెనీ. కానీ చాలా సార్లు కొంతమంది ఖాతాలు ఎటువంటి తప్పు లేకుండానే బ్లాక్ అవుతాయి. ఇది మీకు కూడా జరిగి ఉంటే, మీరు ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా మీ ఖాతాను సరిదిద్దవచ్చు.
వాట్సాప్ ఖాతాలను ఎందుకు నిషేధిస్తుంది?: వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి. ఎవరైనా వినియోగదారు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి ఖాతాను నిషేధించవచ్చు. ఇందులో ఎవరికైనా స్పామ్ సందేశాలను పంపడం, అశ్లీలమైన లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పంచుకోవడం, ఒకే ఖాతా నుండి ఎక్కువ గ్రూప్‌లకు ఆహ్వానాలను సృష్టించడం, అలాగే పంపడం లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటివి ఉంటాయి.
ఖాతా ఎందుకు నిషేధించబడిందో మనకు ఎలా తెలుస్తుంది?: వాట్సాప్ ఖాతా నిషేధించినప్పుడు, మీ నంబర్‌కు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఖాతాను నిషేధించడానికి గల కారణాన్ని కూడా ఈ నోటిఫికేషన్లో ప్రస్తావిస్తారు. దీన్ని జాగ్రత్తగా చదవండి. ఇది చదవడం ద్వారా ఖాతా ఎందుకు నిషేధించబడిందో మీకు తెలుస్తుంది. ఇది ఎక్కువగా వాట్సాప్ నిబంధనల ఉల్లంఘన వల్ల జరుగుతుంది. ఇందులో స్పామ్, ధృవీకరించని సందేశాలను పంపడం కూడా ఉంటుంది. ఇది కాకుండా, ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను ఉపయోగించడం ద్వారా ఇది జరుగుతుంది.
సమస్య పరిష్కారం ఎలా?: మీ వాట్సాప్ ఖాతా పొరపాటున నిషేధిస్తే మీరు వాట్సాప్‌లో సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. దీని కోసం యాప్‌లోని సహాయ విభాగానికి వెళ్లండి. మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను ఇమెయిల్ ద్వారా నివేదించండి. మీ కాంటాక్ట్ నంబర్, పూర్తి వివరాలు, మీ ఖాతా నిషేధించబడటానికి గల కారణాన్ని ఇమెయిల్ పంపండి.
పరిష్కారానికి ఎన్ని రోజులు పడుతుంది?: చాలాసార్లు వాట్సాప్ ఖాతాను తాత్కాలికంగా నిషేధిస్తుంది. ఈ రకమైన నిషేధాన్ని 24 గంటల నుండి 30 రోజులలోపు ఎత్తివేయవచ్చు. కానీ ఈ సమయంలో GBWhatsApp, WhatsApp Plus వంటి ఏ థర్డ్ WhatsApp మోడ్‌ను ఉపయోగించవద్దు.