తిరుమల శ్రీవారిని సినీనటి ఆషికా రంగనాథ్ మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆషికా రంగనాథ్.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుమలలో అందించే ప్రసాదం చాలా రుచిగా ఉందని చెప్పారు. తిరుమలలో ఎటు చూసినా పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నానన్న ఆషికా రంగనాథ్.. అంత పెద్ద స్టార్‌తో కలిసి నటించడం థ్రిల్లింగ్‌గా ఉందన్నారు.