తెలుగు చిత్రపరిశ్రమలో అతడు స్టార్ హీరో. 13 ఏళ్లకే సినీరంగంలోకి అడుగుపెట్టి 15 ఏళ్లకే హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోయాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ తక్కువ సమయంలోనే 280 చిత్రాల్లో నటించి మెప్పించాడు. అప్పట్లో ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉండేది. పాతికేళ్ల వయసులోనే ఇండస్ట్రీని ఏలేసిన కుర్రాడు.. కానీ అనుకోకుండా సినిమాలకు దూరమయ్యాడు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అతడు మరెవరో కాదు.. ఒకప్పటి లవర్ బాయ్ హరీష్ కుమార్. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటుడు.
చైల్డ్ ఆర్టిస్టుగా సినీప్రయాణం స్టార్ట్ చేసి తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించాడు. 1990లో హరీష్ నటించిన ప్రేమ ఖైదీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దివంగత నిర్మాత రామానాయుడు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాలో హరీష్ కుమార్, మలా శ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని హిందీ రీమేక్ లో సైతం హరీష్ నటించారు. ఇందులో కరిష్మా కపూర్ కథానాయికగా నటించింది. వీరిద్దరి జోడికి అప్పట్లో మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత తెలుగుతోపాటు హిందీలోనూ హరీష్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
తిరంగా, కాలేజ్ బుల్లోడు వంటి చిత్రాల్లో నటించాడు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండాల్సిన హరీష్.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు తగ్గించేశాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడిగా కనిపించాడు. 2001లో ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యాడు హరీష్. ఆ తర్వాత కొన్నాళ్లకు హిందీలో ఆ గయా హీరో అనే సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. సినీ ప్రయాణంతోపాటు ఆయన వ్యక్తిగత జీవితం సైతం ఒడిదుడుకులతో సాగింది. చిన్నప్పుడు ఒక ప్రమాదంలో గాయపడిన అతడికి ఏళ్ల తరబడి చికిత్స జరగడంతో సీరియస్ బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చాయని సమాచారం. అలాగే ప్రేమ, పెళ్లి విషయంలోనూ సమస్యలు వచ్చాయని అంటుంటారు. ఏదేమైనా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన హరీష్.. అంతే తక్కువ సమయంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సినిమాలు వదిలేసి వాచ్మెన్గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..