హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదలయ్యాయి. మొత్తం 5,07,107 ముంది విద్యార్ధులు రాయగా.. అందులో 4,60,519 మంది (92.78 శాతం) పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. ఫలితాల్లో బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత పొందారు. బాలికలు బాలుర కంటే 2.94 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. తాజా ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులకు జూన్ 3వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు
ఈ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. నేటి నుంచి మే 16వ తేదీ వరకు విద్యార్ధులు ఫీజులు చెల్లించవచ్చు. మార్చి 2025లో ఫెయిలైన విద్యార్ధులందరూ ఫీజు చెల్లించి ఈ పరీక్షలు రాయవచ్చు.
ఇవి కూడా చదవండి
కాగా రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జరిగిన విషయం తెలిసిందే. సీజీపీఏ విధానాన్ని తొలగించడంతో విద్యార్ధులకు సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడింగ్స్ ఇచ్చారు. ఎంతో ఉత్కంఠ నడుమ తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విద్యాశాఖ నేడు లేదంటే రేపు విడుదల చేయనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.