
అసెంబ్లీకి రాను పిల్లలను పంపుతానని మాట్లాడుతున్నారు.. సభకు రానప్పుడు ప్రతిపక్షహోదా మీకెందుకు?.. సభకు రానప్పుడు ప్రశ్నించే హక్కు మీకు ఎలా వస్తుంది..? అధికారం ఉంటేనే బయటకు వస్తారా.. అంటూ బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారం లేకపోతే ఫామ్‌హౌస్ నుంచి బయటకు రారా..? అంటూ ప్రశ్నించారు. తాము పదేళ్లు అధికారంలో ఉంటామని.. కేసీఆర్ పదేళ్లు ఫామ్‌హౌస్‌లోనే ఉండాల్సిందేనంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ సభలో కేసీఆర్.. ప్రభుత్వ పథకాలు ఆగాయంటూ పేర్కొనడంపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ తెచ్చిన పథకాల్లో ఏ పథకం ఆగిందో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత కరెంట్, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంట్ సహా ఎన్నో పథకాలు అమలవుతున్నాయి… ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కేసీఆర్‌కు కనబడటం లేదా? అని ప్రశ్నించారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్లు గుంపు పాలైందని.. కాళేశ్వరం సహా ఏ పథకం మీదైనా చర్చకు సిద్ధమేనంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ నిర్ణయాల్లో లోపాలు ఉంటే సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కడుపు నిండా విషం పెట్టుకుని కేసీఆర్ మాట్లాడుతున్నారంటూ రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా? అని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్‌కు.. విమర్శించే హక్కు లేదన్నారు. పదేళ్ల పాలనలో ప్రజలకు కాదు.. మీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటూ సీఎం రేవంత్ విమర్శించారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..