పోలీస్ శాఖలో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహించి బుధవారం పదవీ విరమణ పొందిన మొహమ్మద్ అబ్దుల్ అజీమ్‌ను తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. CAR(City Armed Reserve) హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యాలయంలో సీఏఆర్ డీసీపీ, అడిషనల్ డీసీపీ అజీమ్‌ను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అలాగే బంజరాహిల్స్‌లోని సిటీ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సీటీ, హైదరాబాద్ జాయింట్ సీసీ కూడా అబ్దుల్ అజీమ్‌ను ఘనంగా సన్మానించారు. కో ఆపరేటివ్ సోసైటీ హైదరాబాద్ సిటీ ఆధ్వర్యంలో కూడా మరో కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ శాఖలో అజీమ్ అందించిన సేవలను పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. డిపార్ట్మెంట్ అజీమ్‌ను ఎంతో మిస్ అవుతుందని అన్నారు. అజీమ్‌తో పాటు మరి కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులతో పాటు రిటైర్ అయిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి