ప్రస్తుతం తెలంగాణలో విద్యాసంస్థలకు సమ్మర్ హాలిడేస్ కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు విద్యార్థులకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీలకు కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవులును ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు వేసవి సెలవులను ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సెలవుల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ ద్వారా గుడ్లు, సరుకులు సరఫరా చేయనుంది. సెలవుల్లో అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే వంటి విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వేసవి కాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, సీఐటీయు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే అంగన్వాడీ యూనియన్ల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులును ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Bank Holiday: కస్టమర్లకు అలర్ట్.. మే 1న బ్యాంకులకు సెలవేనా..?
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల ముగిసి మే నెల వచ్చేసింది. ఎండలు మరింత తీవ్రతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: May New Rules: మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి