కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న చిన్నది శ్రీనిధి శెట్టి. ఈ మూవీతో ఈ అమ్మడు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో కేజీఎఫ్ తర్వాత శ్రీనిధికి వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికీ చాలా భాషల్లో ఈ ముద్దుగమ్మ నటించింది. కానీ తెలుగులో ఇంత వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.
కానీ అతి త్వరలో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది. శ్రీనిధి శెట్టి హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎందుకంటే? ఇప్పటికే హిట్ , హిట్2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో ఈ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ఈ చిన్నది ఈ సినిమాతో తప్పకుండా హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు.
ఇక హిట్ 3 సినిమా మే1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీంతో నాని, శ్రీనిధి శెట్టి ఇరువురు ప్రమోషన్స్‌లో పాల్గొంటూ..మూవీపై హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్లో ఈ చిన్నది బ్లాక్ కలర్ చీరలో అందంగా మస్తాబై, ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
బ్లాక్ కలర్ చీరలో సింపుల్ లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మీరు ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి మరి.