
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన ఒప్పో నుంచి విడుదలైన ఫోన్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. మెరుగైన పనితీరు, ఆధునిక ఫీచర్ల కారణంగా ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో మధ్య తరగతి ప్రజల కోసం ఒప్పో కంపెనీ ఏ5 ప్రో ఫోన్ ను విడుదల చేసింది. గతేడాది జూన్ లో విడుదలైన ఒప్పో 3ప్రో 5జీ ఫోన్ కు ఇది కొనసాగింపు అని చెప్పవచ్చు. ఒప్పో ఏ5 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, అలాగే 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ అనే రెండు రకాల వేరియంట్లలో లభిస్తోంది. మోచా బ్రౌన్, ఫెదర్ బ్ల్యూ షేడ్స్ రంగులలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే ఏఐ ఎరేజర్ 2.0, లైవ్ ఫొటో, ఏఐ పోర్ట్రెయిట్ రీటౌచింగ్, ఏఐ రిఫెక్షన్ రిమూవర్, ఏఐ స్డూడియో తదితర ఏఐ ఆధారిత లక్షణాలున్నాయి.
6.67 అంగుళాల ఐపీఎస్ ప్యానెల్, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ, వీసీ కూలింగ్ టెక్నాలజీతో పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ ఓఎస్ 15పై నడుస్తుంది. బ్యాటరీ సామర్థ్యానికి ఢోకా లేదు. దీనిలో 5800 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ అయిపోతుందనే సమస్య ఉండదు. రోజంతా చక్కగా వినియోగించుకోవచ్చు. 45 డబ్ల్యూ సూపర్ వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ప్రధాన సెన్సార్, 2 ఎంపీ మోనో క్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోల కోసం ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు.
ఒప్పో ఏ5 ప్రో 5జీ ఫోన్ లోని 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కలిగిన బేస్ వేరియంట్ ను రూ.17,999ను కొనుగోలు చేయవచ్చు. అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ తో వచ్చిన హై ఎండ్ వేరియంట్ ధరను రూ.19,999గా నిర్ధారించారు. ఒప్పో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్ కార్డ్, అమెజాన్ తో పాటు దేశంలోని ప్రధాన రిటైల్ అవుట్ లెట్ లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్ బీఐ, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు, బీవోబీ ఫైనాన్షియల్, ఫెడరల్ బ్యాంకు, డీబీఎస్ క్రెడిట్ కార్డులపై రూ.1500 తక్షణ డిస్కౌంట్ అందజేస్తున్నారు. ఆరు నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పెమెంట్ విధానంలోనూ కొనుగోలు చేసుకోవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి