నవీన్ బాబు ఘంటా అలియాస్ నాని — సాదీసీదా పేరు పెట్టుకున్నాడు కానీ చిత్ర పరిశ్రమలో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. నటుడిగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు. తాజాగా హిట్ : ది థర్డ్ కేస్తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు నేచురల్ స్టార్ నాని. మే 1న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 43కోట్లు సాధించి నాని కెరీర్లో అదిరే ఆరంభాన్ని నమోదు చేసింది. ఇక రెండో రోజూ మంచి వసూళ్లలు రాబట్టింది. శుక్రవారం ఈ మూవీ రూ.19 కోట్లు (గ్రాస్) వసూల్ చేసింది.
దీంతో 2 రోజుల్లోనే హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా రూ. 62 కోట్ల (గ్రాస్) మార్క్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బాక్సీఫీస్ వద్ద అర్జున్ సర్కార్ వేట కొనసాగుతోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. శనివారం, ఆదివారం.. మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ వీకెండ్ ముగిసే సమయానికి రూ.100 కోట్ల మార్క్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.
It is SARKAAR’S HUNT at the box office 💥💥#HIT3 grosses 62+ CRORES WORLDWIDE in 2 days ❤🔥
Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0Ry1#BoxOfficeKaSarkaar#AbkiBaarArjunSarkaar pic.twitter.com/YVf89blt27
— Wall Poster Cinema (@walpostercinema) May 3, 2025
‘హిట్’ సిరిస్లో భాగంగా తెరకెక్కిన మూడో చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సంగీతం అందించగా.. నానితో కలిసి ప్రశాంతి తిపిర్నేని చిత్రాన్ని నిర్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..