హైదరాబాద్, మే 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ ఈఏపీసెట్ 2025 పరీక్షలు మే 4తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేయగా.. సోమవారం ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక ఆన్సర్ కీ కూడా విడుదలైంది. విద్యార్ధులు అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీతోపాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను ఆన్లైన్ విధానంలో లేవనెత్తడానికి మే 7వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు రోజులపాటు ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగం ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. ఇక మే 4న అగ్రికల్చర్ – ఫార్మసీ స్ట్రీమ్ ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసి విభాగం ప్రాథమిక కీ పై అభ్యంతరాలను తెలపడానికి మే 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు గడువు ముగిసింది.
కాగా ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగానికి 2,20,327 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,07,190 మంది అంటే 94.04 శాతం మంది విద్యార్ధులు రాత పరీక్షకు హాజరయ్యారు. చివరి రోజూ మ్యాథమెటిక్స్ విభాగం ప్రశ్నలు మాత్రం కాస్త కఠినంగా వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా ఈ విభాగంలో సగం ప్రశ్నలకు 80 శాతానికిపైగా విద్యార్ధులు ఏదొక జవాబు రాసి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. అగ్రికల్చర్ విభాగం పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 86,762 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 81,198 మంది అంటే 93.59 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈఏపీసెట్ ఫలితాలు మే 15వ తేదీ ఉదయం ఫలితాలు విడుదల కానున్నాయి.
తెలంగాణ ఈఏపీసెట్ 2025 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీ విడుదల.. మే7 వరకు అభ్యంతరాలకు గడువు
దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE 2025) రాత పరీక్ష ఏప్రిల్ 5న ఆఫ్లైన్ విధానంలో పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా దీని ఆన్సర్ కీ విడుదలైంది. కీ పై అభ్యంతరాలను మే 7 వరకు లేవనెత్తవచ్చు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2025-26 విద్యా సంవత్సరానికి 6వ, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.