దిన ఫలాలు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మీద కూడా ఖర్చు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు మంచి లాభాలతో ఆశాజన కంగా ఉంటాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమా చారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీగా పురోగమిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి ఆర్థిక లావాదేవీలు అత్యధిక లాభాలని స్తాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలమవు తుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందు తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశముంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితముం టుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఒకరిద్దరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుం టారు. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. అవసరానికి మించి చేతిలో డబ్బుండే అవ కాశం ఉంది. ప్రయాణాలు బాగానే లాభిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు భారీ లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. సహచరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహా రాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభించడంతో పాటు హోదాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో రాబడికి ఢోకా ఉండదు. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. బంధుమిత్రుల నుంచి ఇబ్బందులు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగా మెరుగ్గా ముందుకు సాగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమ వుతాయి. తలపెట్టిన పనులు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించుతాయి. పిల్లల నుంచి ఆశిం చిన శుభ సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా మంచి ఆఫర్లు అందు తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. అధికారులకు మీ సమర్థత మీదమ నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు వృద్ధి చెందుతాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో సంతృప్తికరంగా పూర్తవు తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పనిభారం పెరిగినా బాద్యతల్ని సకాలంలో, సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. అధికారు లకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో బాధ్యతలు మారడం వల్ల పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగి పోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులను సకా లంలో పూర్తి చేయగలుగుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించు కుంటారు. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొద్దిపాటి అనారోగ్యాలు తప్పకపోవచ్చు. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. నిరుద్యో గులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల కొద్దిగా ధన నష్టం జరిగే అవ కాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు ప్రవేశపెడతారు. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది.