ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా ఘర్షణ పడుతున్నారు. వీలైనంత త్వరగా పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. రెండు దేశాలు ఇలా దాడులతో ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. ఇరుదేశాలకు ఎంతో చరిత్ర ఉంది. అలాగే, ఎన్నో ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. అయితే, ప్రపంచానికి మాత్రం శాంతి మాత్రమే కావాలి. గొడవలు వద్దు’’ అని కోరారు.