Andhra Pradesh Yearly Road Accidents: ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు భయంకరంగా పెరుగుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత పదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం ప్రధాన కారణాలు. ఈ ప్రమాదాల నివారణకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదాల వెనుక ఉన్న నిజాలు ఏంటి? రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
హైలైట్:
- ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి
- ఏటా ప్రమాదాల్లో ఎంతమంది చనిపోతున్నారంటే
- గత పదేళ్ల లెక్కలు.. ఆ ఏడాది మాత్రం తక్కువగా

2015 నుంచి 2024 వరకు లెక్కలు చూస్తే.. 2020లో కొవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రమాదాలు బాగా తగ్గాయని తేలింది. మిగిలిన సంవత్సరాల్లో ప్రమాదాలు ఎక్కువగానే ఉన్నాయి. పదేళ్లలో నాలుగేళ్లు మరణాల సంఖ్య తగ్గింది.. కానీ ఆరేళ్లలో మాత్రం పెరిగింది. జాతీయ రహదారులపై 32.95 శాతం ప్రమాదాలు జరిగాయి. రాష్ట్ర రోడ్లపై 23.13 శాతం, గ్రామీణ రోడ్లపై 39.43 శాతం ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా 72.4 శాతం రోడ్డు ప్రమాదాలకు అతి వేగమే కారణం అని నివేదికలో తేలింది. అంటే చాలా ప్రమాదాలు వేగంగా నడపడం వల్లే జరుగుతున్నాయి. రాంగ్ రూట్లలో వెళ్లడం వల్ల 4.8 శాతం, మద్యం తాగి నడపడం వల్ల 2.2 శాతం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల 1.6 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఏపీలో రోడ్డు ప్రమాదాలతో ఏడాదికి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా.. గత పదేళ్లలో!
రాష్ట్ర రవాణా శాఖ, పోలీసుల లెక్కల ప్రకారం కొన్ని విషయాలు తెలిశాయి. 2018 నుంచి 2024 వరకు చూస్తే.. బైక్ల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. ఆ తర్వాత కార్లు, లారీలు ఉన్నాయి. బైక్లను, కార్లను వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమయ్యాయి. ప్రమాదాలను తగ్గించడానికి పోలీసులు ఇటీవలకాలంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు నియమాలను పాటించాలని.. మద్యం తాగి వాహనాలు నడపకూడదని చెబుతున్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని.. జాగ్రత్తగా ఉంటేనేప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోగలమని అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.