ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందినట్లు సమాచారం. మసూద్ అజహర్ సోదరి, ఆమె భర్త, ఇతర బంధువులు మరణించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే పంజాబ్లో గుర్తు తెలియని విమానం కూలిపోయిందని తెలిసింది. బఠిండా జిల్లా అక్లియన్ కలాన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది..
పంజాబ్లోని బతిండాలోని అక్లియన్ ఖుర్ద్ గ్రామంలో తెల్లవారుజామున 1:30 గంటలకు గుర్తుతెలియని విమానం కూలిపోయింది. జనావాసాలకు 500 మీటర్ల దూరంలో గోధుమ పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారని, 9 మంది గాయపడ్డారాని సమాచారం. కాగా నేల కూలిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
🚨 An unidentified aircraft crashed in Bathinda’s Aklian Kalan village around 2 AM today#OperationSindoor#IndiaPakistanWar#IndiaPakistanhttps://t.co/feX87eoeow pic.twitter.com/3FHk1NwCiu
— Vivek Dhingra (@Vivek_Dhingra_) May 7, 2025
ఇదిలా ఉంటే, దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఢిల్లీలో భద్రతను పెంచారు. కీలక ప్రదేశాల్లో అదనపు పోలీసు సిబ్బంది, పారామిలిటరీ దళాలను మోహరించడంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు, ఉత్తర్ప్రదేశ్లోనూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. పోలీసులు రక్షణ శాఖ వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ప్రజలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆ రాష్ట్ర డీజీపీ సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..