మీరు ఎంత శుభ్రంగా ఉంచినా, వంట చేసేటప్పుడు, ఇతర పనులు చేసేటప్పుడు వంటగది మురికిగా మారడం షరా మామూలే. ముఖ్యంగా వంటగదిలోని గ్యాస్ స్టవ్ మురికిగా మారడం, బట్టలపై నూనె, ఇతర ఆహార మరకలు కనిపించడం సర్వసాధారణం. అయితే వీటిని డిటర్జెంట్‌తో ఎంత రుద్దినా ఒక్కోసారి మరకలు ఓ పట్టాన వదలవు. దీంతో గృహిణులు ప్రతిసారి వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్‌పై పేరుగు పోయిన మురికి ఎంత శుభ్రం చేసినా వదలడం లేదని తెగ హైరానా పడిపోతుంటారు. అయితే ఈ కింది చిట్కాలను అనుసరించడం ద్వారా మరకలను సులభంగా తొలగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాగంటే..
బట్టలపై మరకలు,గ్యాస్ స్టవ్ మురికిని తొలగించడానికి ఉపయోగపడే చిట్కాలు ఇవే..
జీన్స్ నుంచి మరకలు, గ్యాస్ స్టవ్‌ల నుంచి మురికి, ఇస్త్రీ బోర్డుల నుంచి మరకలను సులభంగా ఎలా తొలగించాలో చిట్కాలను అందించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మరకలు వదిలించే సింపుల్ చిట్కాలు చూసేయండి.
ఇవి కూడా చదవండి
Next-Level Cleaning Tips pic.twitter.com/jpLf8QPYYV
— Learn Something (@cooltechtipz) May 6, 2025
జీన్స్ మీద మరకలు ఉంటే, వాటిని స్క్రబ్ చేయడానికి డిటర్జెంట్ ఉపయోగించే బదులు, మరకలు ఉన్న ప్రదేశంలో కొద్దిగా బేకింగ్ సోడాను అప్లై చేసి, పైన సాదా కాగితాన్ని ఉంచి, ఇస్త్రీ బోర్డుతో కొద్దిగా వేడి చేయడం ద్వారా మరకను సులభంగా తొలగించవచ్చు.
గ్యాస్ స్టవ్ మీద గ్రీజు లేదా ఇతర మురికి ఉంటే, దానిపై సబ్బు నీరు పోసి, స్క్రబ్బర్ తో సున్నితంగా రుద్దడం ద్వారా మురికిని తొలగించవచ్చు. ఇస్త్రీ చేసేటప్పుడు ఫాబ్రిక్ రంగు ఇస్త్రీ బోర్డుకు అంటుకుంటే, ఇస్త్రీ బోర్డును కొద్దిగా వేడి చేసి, మరకపై ఆస్ప్రిన్ టాబ్లెట్‌ను రుద్దడం ద్వారా మరకను సులభంగా తొలగించవచ్చు. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మరకలు, ధూళిని సులభంగా తొలగించవచ్చు.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.