భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం వైమానిక దాడి చేసి పాకిస్తాన్‌పై చర్య తీసుకుంది. దీని కారణంగా పాకిస్తాన్లో పరిస్థితి మరింత దిగజారింది. ఏ దేశంలో ఏదైనా విపత్తు లేదా ఒత్తిడితో కూడిన పరిస్థితి ఎదురైనప్పుడు, అది మొదట సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో సామాన్య పౌరులందరూ తమ భద్రత, మనుగడ కోసం సాధ్యమైన ప్రతి సన్నాహాలు చేసుకోవాలని సూచిస్తున్నారు.
భారతదేశంలో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో తెలియకుండా ఉంది. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ప్రజలు కొన్ని రకాల వస్తువులను నిల్వ చేసుకోవడం మంచిది. యుద్ధం వంటి పరిస్థితి తలెత్తితే, ఇంట్లో ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండే నిల్వ ఉండే 10 ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
- తేనె ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండే వాటిలో ఒకటి. ఇందులో చాలా తక్కువ నీరు ఉండటం వల్ల ఇది త్వరగా చెడిపోదు. ఫంగస్ , బ్యాక్టీరియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల తేనెను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు.
- చక్కెరను 3 నెలల వరకు సులభంగా నిల్వ చేయవచ్చు. చక్కెరలో తక్కువ నీరు ఉంటుంది, ఇది ఫంగస్ , బ్యాక్టీరియా పెరగడానికి అనుమతించదు. అయితే పంచదారని నిల్వ చేసుకోవడానికి తేమ నుంచి రక్షించుకోవడం ముఖ్యం.
- ఉప్పు ప్రతి ఇంట్లో ఉంటుంది. భారతీయ ఆహారంలో ఉప్పును ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో ఉప్పుని నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యం. ఉప్పు చాలా కాలం మన్నికైన పదార్థం. అందులో నీటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఉప్పులో ఫంగస్ లేదా బ్యాక్టీరియా పెరగవు.
- యుద్ధ సమయంలో ఎక్కువ కాలం ఉండే వాటిలో కాఫీ ఒకటి. కాఫీ అనేది పొడి ఆహార ఉత్పత్తి. ఇందులో చాలా తేమ ఉంటుంది. అందుకే ఇది త్వరగా చెడిపోదు. పొడి, చల్లని ప్రదేశంలో ఉంచడం వల్ల దాని జీవిత కాలం పెరుగుతుంది.
- పప్పు ధాన్యాలు: వివిధ రకాల పప్పులను 3 నెలల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. కొన్ని పప్పు ధాన్యాలు త్వరగా చెడిపోతాయి. అయితే వాటిని ఎండలో ఆరబెట్టి ఒక డబ్బాలో వేసి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. కనుక పప్పుధాన్యాలను ఎల్లప్పుడూ శుభ్రమైన, పొడి కంటైనర్‌లో ఉంచండి.
- బియ్యం: భారతీయ ఇళ్లలో ఆహారంలో బియ్యం కూడా ఒక ముఖ్యమైన భాగం. సాధారణంగా బియ్యాన్ని కొన్ని నెలలు సులభంగా నిల్వ చేయవచ్చు. అయితే వాటిని నిల్వ చేసుకునే సమయం పెరగాలంటే బియ్యంలో వేప ఆకులు లేదా లవంగాలను జోడించండి.
- డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ కాలం చెడిపోవు. వీటిని 3-4 నెలలు సులభంగా నిల్వ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ పొడిగా ఉంటాయి. వీటిలో తేమ, నీరు తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఇవి త్వరగా చెడిపోవు.
- డార్క్ చాక్లెట్: ఇవి కూడా త్వరగా చెడిపోవు. ఎందుకంటే ఇందులో తేమ తక్కువగా ఉండి కోకో శాతం ఎక్కువగా ఉంటుంది. కోకోలో ఉండే మూలకాలు బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయి. డార్క్ చాక్లెట్‌ను ఎక్కువ కాలం తినదగినవిగా చేస్తాయి.
- పాలపొడి: పాలపొడి త్వరగా చెడిపోదు. పాలపొడిని తయారు చేసే ముందు పాశ్చరైజేషన్ చేస్తారు. దీనిలో హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి పాలను వేడి చేస్తారు. ఈ ప్రక్రియ పొడి జీవిత కాలాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
- ఊరగాయలు చాలా కాలం పాటు ఉండే ఆహారం. దీనికి జోడించిన ఉప్పు , నూనె సంరక్షణకారులుగా పనిచేస్తాయి. కనుక ఉరగాయలు కూడా త్వరగా చెడిపోవు. ఊరగాయలను ఎక్కువ రోజులు తినవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)