బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన మూడు దీర్ఘకాలిక వ్యాలిడిటీతో వచ్చే రీఛార్జ్ ప్లాన్లు ఇప్పుడు మదర్స్ డే ప్రత్యేక ఆఫర్లో ధరలు భారీగా తగ్గించారు. ఈ తగ్గింపు ధరలు మే 14 వరకు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులంతా ఈ కొత్త ఆఫర్ల ద్వారా ప్రయోజనం పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తన మూడు రీఛార్జ్ ప్లాన్లపై 5 శాతం తగ్గింపును అధికారికంగా ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ ఆఫర్‌ను అందించింది.
రూ. 2399 ప్లాన్
రూ.2399 రీచార్జ్ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, అపరిమిత వాయిస్ కాల్స్ సదుపాయాలను బీఎస్ఎన్ అందిస్తుంది. అదనంగా బైటీవీకు ఉచిత యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. దీని వల్ల వినియోగదారులు తమ ఫోన్లలో 350 కి పైగా లైవ్ టీవీ స్టేషన్లను వీక్షించవచ్చు.
రూ. 997 ప్లాన్
ఈ ప్యాక్ వినియోగదారులకు 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్లు, ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా బై టీవీకు ఉచిత యాక్సెస్ పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
రూ. 599 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు 100 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు రోజువారీ 3 జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. అలాగే భారతదేశం అంతటా అపరిమిత కాల్స్ సదుపాయాన్ని ఆశ్వాదించవచ్చు. ఇతర ప్లాన్ల మాదిరిగానే బై టీవీకి ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి