పెళ్లి చేసుకోడానికి వధువు దొరకడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా యెల్లారెడ్డిపేట మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. మే 7 బుధవారం 23 ఏళ్ల యువకుడు వధువు దొరకకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బాధితుడిని గొర్రెల కాపరిగా పనిచేసే ఒగ్గు మహేష్‌గా గుర్తించారు. అందుతోన్న సమాచారం ప్రకారం మహేష్ చాలా సంవత్సరాలుగా తగిన వివాహ బంధం కోసం వెతుకుతున్నాడు. కానీ తనకు నచ్చిన వధువు దొరకలేదు. తన పరిస్థితిపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని సమాచారం. దీంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం గ్రామ శివార్లలోని ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ తల్లి రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
( మీరు ఆత్మహత్య ఆలోచనలతో సతమతం అవుతుంటే లేదా మీకు తెలిసిన వ్యక్తి ఆ తరహా ఆలోచనల్లో ఉంటే దయచేసి మీ సమీప మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. లేదా ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ అయిన రోష్నిని 040–66202000 సంప్రదించండి )
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..