పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మొదలైన ఉద్రిక్త పరిస్థిస్తులు, ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసిన సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులను అంతం చేసింది. దీంతో భారత్‌పై పాక్ కూడా ప్రతికార దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో 15 సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన భారత సైన్యం వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది.
ఇక తాజాగా జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి దిగింది. అప్పటికే యుద్ద సిద్ధంగా భారత సైన్యం ప్రత్యర్థి డ్రోన్లు, రాకెట్లను సమర్థవంతంగా అడ్డుకొని కూల్చివేసింది. ఈ నేపథ్యంలో జమ్ము నగరం మొత్తం విద్యుత్ అంతరాయం కలిగింది. శత్రు సేనల నుంచి వస్తున్న డ్రోన్లను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో భారత సైన్యం కూల్చివేసింది. కొన్ని రాకెట్లను కూడా కూల్చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్-పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత అప్రమత్తం చేసింది. ఢిల్లీ, హర్యానా, బెంగాల్‌లో రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. పోలీసులు, పాలనాధికారుల, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులు రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం కుదరదని ప్రబుత్వం స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సిద్ధంగా ఉండాలని ఉద్యోగస్తులకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి. స్కూళ్లను కాలేజీలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీగా భద్రత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హమీపుర్, ఉనా, బిలాస్‌పుర్ భద్రతను పెంచింది. వీటితో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలను ముమ్మరం చేసింది. దేశంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరికలు జారీ చేసింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, అనవసరంగా బయటకు రావొద్దని సూచనలు జారీ చేసింది.
పాక్ సరిహద్దుల్లో కీలక ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో పూర్తిగా యుద్ధవాతావరణం నెలకొంది. ముఖ్యంగా జమ్ము, రాజోరీ, ఉధంపూర్, శ్రీనగర్ ప్రాంతాలను చీకట్లు కమ్ముకున్నాయి. జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ వేసిన మిసైల్స్‌ను భారత సైన్యం ఆకాశంలోనే పేల్చేసింది.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో బోర్డర్‌కు దగ్గరగా ఉన్న జిల్లాల్లో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రత్యేక నిఘా, బ్లాకౌట్‌లు అమలు చేస్తోంది. ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, అమృత్‌సర్, గుర్దాస్‌పూర్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..