సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ. అంతే కాదు టాలీవుడ్ ను ఒకానొక సమయంలో ఏలింది ఆమె.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్ లో ఎన్నో హైట్స్ చూసింది. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. అంతే కాదు వ్యక్తిగతం గాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట ఓ వ్యక్తిగా ఘాడంగా ప్రేమించింది. ఆతర్వాత అది కాస్త బ్రేకప్ అయ్యింది. దాంతో డిప్రషన్ లోకి వెళ్ళింది. కోలుకొని తిరిగి సినిమాల్లో రాణించాలనుకుంది.. కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది. తాజాగా ఆమె పిల్లల పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీని ఏలింది ముద్దుగుమ్మ ఇలియానా. 2006లో ‘దేవదాసు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది. ఆతర్వాత ఓ వ్యక్తిని రిలేషన్ లో ఉండటం.. అతనితో బ్రేకప్ అవ్వడం.. డిప్రషన్ లోకి వెళ్లడం అన్ని చకచకా జరిగిపోయాయి.
ఆతర్వాత ఈ ముద్దగుమ్మ మరో వ్యక్తితో రిలేషన్ లో ఉంది. పెళ్లికాకుండానే ఇలియానా ప్రగ్నెంట్ అయ్యింది. అలాగే బిడ్డకు జన్మనిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ లో నా పిల్లలు నా ప్రేమను సంపాదించుకోవాలి అని నేను భావించడం లేదు అని ఇలియానా తెలిపింది. సంతోషంగా, ఆరోగ్యంగా, మంచి దయగల పిల్లలను పెంచాలనుకుంటున్నా..క్రూరంగా, దయలేకుండా, స్వార్థపూరితంగా నా పిల్లలు పెరగాలని నేను అనుకోవడం లేదు. పిల్లలకు ప్రేమను ప్రతిఫలంగా ఇవ్వకూడదు. గౌరవం, ఆనందం లాగానే ప్రేమను సంపాదించాలి అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా. కాగా ఇలియానా ఇటీవలే రెండో సారి తల్లికాబోతున్నటు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.