
పనసుపండు తిన్న తర్వాత కొందరికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. కొందరికి పనసు తిన్న తర్వాత శరీరంపై దురద, వాపు, చర్మంపై చారలు రావడం, కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీ ఉన్నవాళ్లు పనసుపండుకి దూరంగా ఉండడం మంచిది. పనసుపండులో చక్కెర మోతాదులు చాలా ఎక్కువ. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు దాన్ని డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఆపరేషన్ కు ముందు లేదా తర్వాత పనసుపండును తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. పనసులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి పొటాషియం ఎక్కువగా తీసుకోవడం ప్రమాదం కలిగిస్తుంది. కాబట్టి కిడ్నీ వ్యాధులు ఉన్నవారు పనసుపండును పూర్తిగా నివారించాలి. అందుకే వేసవిలో పనసుపండును మితంగా తీసుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం :