కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది.
చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.
తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కానీ మలయాళంలో మాత్రం ఈ భామ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక ఈ చిన్నది గ్లామర్ షోకు దూరంగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అక్కడ వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ బ్యూటీ ఆచి తూచి సినిమాలు చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పిక్స్ షేర్ చేస్తుంది కళ్యాణి. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ గా ఉంది ఈ చిన్నది. ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.