టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో సంచలనం సృష్టించింది. డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి జంటగా నటించారు. సోషియో ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈసినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. అప్పట్లో ఈసినిమా భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ.2 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.15 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ఇక ఈ చిత్రానికి ఇళయారాజా అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ అయ్యింది. ఇప్పటికీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సాంగ్స్ యూట్యూబ్ దూసుకుపోతున్నాయి.
చిరు, శ్రీదేవి జోడికి.. కెమిస్ట్రీకి అడియన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు మేకర్స్. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మరోసారి సెన్సెషన్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబధించిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. అప్పట్లో ఈ సినిమా కోసం చిరంజీవి, శ్రీదేవి ఎంత రెమ్యునరేషన్స్ తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు అప్పట్లో చిరంజీవి రూ.25 లక్షలు.. శ్రీదేవి రూ.20 లక్షలు పారితోషికంగా తీసుకున్నారట.
ఈ సినిమా సమాయనికే చిరు, శ్రీదేవి ఇద్దరూ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్. వీరిద్దరి కెమిస్ట్రీ, యాక్టింగ్ కు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని 4K, 3D ఫార్మాట్‌లలో రీరిలీజ్ చేశారు మేకర్స్.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సినిమాలు వదిలేసి వాచ్మెన్గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్.