ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేని పాక్ సైన్యం భారత నియంత్రణ రేఖ (LOC) వద్ద కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌కు భారత్ గట్టి గుణపాఠం చెప్పటంతో మరింతగా రెచ్చిపోయింది పాక్. పిచ్చెక్కిపోయినట్టుగా సరిహద్దు ప్రాంతాలైన కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులతో రెచ్చిపోయింది. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే జమ్మూ నగరంలోని రూప్‌నగర్ ప్రాంతంలోని సత్రియన్‌లో ఉన్న ప్రముఖ ఆప్ శంభు ఆలయాన్ని పాక్ ఆర్మీ టార్గెట్‌గా చేసుకుని మిస్సెల్ దాడికి పాల్పడింది.
వీడియో ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి
🚨 BREAKING NEWS
Pakistani missile narrowly misses Aap Shambu Temple in Jammu — Attack thwarted, no casualties.pic.twitter.com/UnqsPWXVQd
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 10, 2025
అప్రమత్తమైన భద్రతా బలగాలు క్షిపణిని ఆకాశ్ మిస్సైల్ టెక్నాలజీతో కూల్చివేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడితో భారత్,పాక్ నడుమ ఉద్రిక్తత మరింత తీవ్రతరంగా మారింది. ఉగ్రవాద దాడిలో జరిగిన హత్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించినప్పటి నుండి ఈ యుద్ధం తీవ్ర పెరుగుతూనే ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..