ఈరోజు వన్ బీహెచ్ కేలో ప్రయాణిస్తున్నానని ఆ కస్టమర్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. అబ్దుల్ ఖదీర్ ఉబర్ డ్రైవర్ గా తన కారును రోడ్డుపైకి తీసుకెళ్తున్నప్పుడు ప్రయాణికులకు బోర్ కొట్టడం అనేదే ఉండదు. స్నాక్స్, బొమ్మలు, మెడిసిన్స్ ఇలా అన్ని అతని కాబ్ లో అమర్చాడు. పెద్దలకి, పిల్లలకి అవసరమైన వస్తువుల్ని అందుబాటులో ఉంచాడు. కాబ్ లో ప్రయాణించిన వారంతా ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇస్తున్నారు. వైఫై, మందులు, స్నాక్స్, ఇంకా బొమ్మలు ఇలా అతని వద్ద అన్ని ఉన్నాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజెన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఒక నెటిజెన్ ఆ కాబ్ లో తన ప్రయాణ అనుభవాన్ని షేర్ చేశాడు. అదే ఉబర్ లో ప్రయాణించాను సూపర్ కూల్ అని రాసుకొచ్చాడు. అబ్దుల్ ఖదీర్ సాధారణ డ్రైవర్ కంటే ఎక్కువ సంపాదించకపోవచ్చు కానీ ఈ సౌకర్యాలన్నీ వాస్తవానికి కనీసం పది మందిలో ఒకరికి సహాయపడతాయని మరొకరు పోస్ట్ పెట్టారు.