ఏపీలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్. తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 15న ఈ పథకం ప్రారంభిచంనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15,000 ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు తెలాపారు. 1-12 తరగతుల విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాగా.. 69.16 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
హైలైట్:
- ఏపీలోని విద్యార్థులకు తీపి కబురు
- తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్
- జూన్ 15న పథకం ప్రారంభం: మంత్రి సవిత

తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జున్ 15న తల్లికి వందనం పథకం ప్రారంభిచనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద చదువుకునే పిల్లలందరకీ రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్ఠమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారని తెలిపారు. బీసీ యువతకు సివిల్స్, మెగా డీఎస్సీ ఫ్రీ ట్రైనింగ్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు విజయవాడలో నగదు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో పాల్గొ్న్న ఆమె.. తల్లికి వందనంపై ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. జూన్ 15న అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు.
కాగా, 2025-26 విద్యా సంవత్సరానికి గాను ‘తల్లికి వందనం’ పథకం కోసం ప్రభుత్వం రూ.9,407 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. వారిలో 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ అంచనా వేసింది. అయితే, ఈ పథకం పొందడానికి విద్యార్థులు కచ్చితంగా 75 శాతం హాజరు కలిగి ఉండాలి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఆర్థిక సహాయం ఒకేసారి రూ.15,000 చెల్లించాలా లేదా రెండు విడతలుగా రూ.7,500 చొప్పున చెల్లించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.
‘అన్నదాత సుఖీభవ’ పథకం మొదటి విడత నిధులు కూడా అదే సమయంలో విడుదల చేయాల్సి ఉండటంతో విడతల వారీగా చెల్లింపుల అంశం తెరపైకి వచ్చింది. ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమలులోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అర్హులైన విద్యార్థుల సంఖ్య, అవసరమైన నిధులపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఈ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా పిల్లల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.