ప్రస్తుతం ప్రపంచం ఉరుకులు పరుగులతో సాగుతుంది. ప్రతి ఒక్కరూ తమ కష్టానికి తగిన ఫలితం దక్కాలని.. సిరి సంపదలతో ఇల్లు నిండి ఉండాలని కోరుకుంటారు. అయితే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్న ఇంట్లోనే ధన ధాన్యాలకు లోటు ఉండదు. అయితే లక్ష్మీ దేవి చంచల స్వభావాన్ని కలిగి ఉంటుందని… కనుక ఆమె ఒక చోట ఉండదని నమ్మకం. అటువంటి పరిస్థితిలో లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి అనేక చర్యలను పాటించడం అమ్మవారిని సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యం. డబ్బులకు ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉండాలంటే.. ధన ధాన్య లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మీరు కోరుకుంటే.. శుక్రవారం రోజున లక్ష్మీ దేవికి కొన్ని వస్తువులను సమర్పించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. అదృష్టం కూడా మీ సొంతం. శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. కనుక ఈ రోజు ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది. శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే.. మీకు రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది.
ప్రసాదంగా బియ్యం పాయసాన్ని అందించండి. లక్ష్మీదేవికి పాలతో చేసిన ఖీర్ అంటే చాలా ఇష్టం కనుక శుక్రవారం ఖీర్ ను నైవేద్యంగా సమర్పించండి. పురాణ కథల ప్రకారం చంద్రుడిని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి బియం పాయసాన్ని చాలా ఇష్టపడుతుంది.
తమలపాకును సమర్పించండి. లక్ష్మీ దేవికి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవిని సంపద, అదృష్ట దేవత అని కూడా పిలుస్తారు. తమలపాకు ఆనందంతో ముడిపడి ఉంది. ఎందుకంటే తమలపాకులకు హిందూ సంప్రదాయంలో విశేష ప్రాముఖ్యత ఉంది. పూజ, వివాహం, శుభ కార్యాల్లో తమలపాకులు తప్పని సరిగా ఉండాల్సిందే.
ఇవి కూడా చదవండి
ప్రసాదంగా నీటి చెస్ట్‌నట్‌ను సమర్పించండి. సముద్ర గర్భం నుంచి జన్మించిన లక్ష్మీ దేవికి కూడా నీటికి సంబంధించినవి అంటే చాలా ఇష్టం. అందుకనే సింఘండేను అదృష్టాన్ని తెచ్చే పండుగా పరిగణిస్తారు. లక్ష్మీదేవికి చేసే పూజలోనైనా లేదా ఉపవాసంలోనైనా నీటి చెస్ట్‌నట్ ప్రసాదాన్ని సమర్పిస్తే అది అదృష్టాన్ని పెంచుతుందని నమ్మకం.
సువాసనగల వస్తువులు: సంపద, అదృష్టానికి దేవత అయిన లక్ష్మీ దేవి కూడా సువాసనను ఇష్టపడుతుంది. పూల సువాసన వచ్చే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే లక్ష్మీదేవికి పువ్వులు కూడా సమర్పించాలి. అంతేకాదు గులాబీ పువ్వులు, తామర పువ్వులు లేదా గంధపు చెక్కతో చేసిన గంధాన్ని కూడా సమర్పించడం శుభప్రదం.
ఎరుపు రంగు దుస్తులు: ఎర్ర రంగు దుస్తులు అదృష్టం, ప్రేమ, విలాసానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే శుభ కార్యక్రమాలలో, ముఖ్యంగా వివాహాలలో ఎరుపు రంగు వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వివాహిత స్త్రీలు శుక్రవారం రోజున లక్ష్మీ దేవికి ఎర్ర గాజులు లేదా కండువాను సమర్పించడం వలన అమ్మవారి అనుగ్రహం మీ సొంతం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు