స్నేక్ ప్లాంట్ పెరిగే చోట గాలి శుభ్రంగా ఉంటుంది. ఇది గాలిలో ఉండే హానికరమైన రసాయనాలను తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. ఫార్మాల్డిహైడ్, బెంజీన్, టోలుయీన్ వంటి ఆరోగ్యానికి చెడు చేసే గ్యాస్‌లను ఇది పీల్చుకుంటుంది. దీనివల్ల ఇంట్లో మనం పీల్చుకునే గాలి మంచిగా ఉంటుంది.
ఈ మొక్క ఆకులు పొడవుగా, ఆకుపచ్చ రంగులో తెల్ల లేదా పసుపు రంగు గీతలతో చాలా అందంగా ఉంటాయి. అందుకే దీన్ని హాల్ లో, బాల్కనీలో లేదా బెడ్ రూమ్ లో ఉంచితే మంచి అలంకరణగా ఉంటుంది.
మిగిలిన మొక్కలతో పోలిస్తే దీనికి ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు. పది లేదా పదిహేను రోజులకొకసారి నీళ్లు పోస్తే చాలు. దీనికి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు. తక్కువ వెలుతురు ఉన్న చోట కూడా ఇది బతకగలదు.
ఈ మొక్కను నీటిలో కూడా పెంచవచ్చు. ఒక గాజు సీసాలో శుభ్రమైన నీళ్లు పోసి అందులో మొక్కను ఉంచితే చాలు. కొన్ని రోజుల్లోనే అది పెరుగుతుంది. మట్టి లేకుండా మొక్కలు పెంచాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
ఈ మొక్క ఎక్కువ స్థలం తీసుకోదు. ఇది పెరగడం మొదలు పెట్టిన తర్వాత దీన్ని బెడ్ రూమ్ లో, వాకిట్లో లేదా బాత్రూంలో కూడా ఉంచవచ్చు. తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా ఇది బతుకుతుంది. ఇంట్లో తాజాగా అనిపించేలా వాతావరణాన్ని మారుస్తుంది.
ఇతర మొక్కలను నెలలకొకసారి కుండీ మార్చాల్సి ఉంటుంది. కానీ స్నేక్ ప్లాంట్ కు అలాంటి సమస్య ఉండదు. ఒకే కుండీలో దీన్ని చాలా సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు. ఇది నెమ్మదిగా పెరుగుతుంది కానీ చాలా కాలం పాటు ఉంటుంది.
ఈ మొక్క రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల దీన్ని బెడ్ రూమ్ లో ఉంచితే మంచి నిద్ర వస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంది. చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఇంట్లో అందాన్ని పెంచడానికి మాత్రమే కాకుండా గాలిని శుభ్రంగా ఉంచడానికి కూడా స్నేక్ ప్లాంట్ ఉపయోగపడుతుంది. తక్కువ శ్రద్ధతో ఎక్కువ లాభాలు ఇచ్చే ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది.