Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Dhurandhar The Revenge: సినిమానే కాదు ట్రైలర్ కూడా రికార్డ్ బ్రేక్ చేసింది..

10 March 2026

Telangana: 10 రోజుల మగ బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎందుకో తెలిసి అధికారులే షాక్..!

10 March 2026

టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Bhogapuram Airport 500 Acres Additional Land,ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. అదనంగా మరో 500 ఎకరాలు, ఉత్తర్వులు జారీ – andhra pradesh government orders on allotted additional 500 acres to bhogapuram international airport
ఆంధ్రప్రదేశ్

Bhogapuram Airport 500 Acres Additional Land,ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. అదనంగా మరో 500 ఎకరాలు, ఉత్తర్వులు జారీ – andhra pradesh government orders on allotted additional 500 acres to bhogapuram international airport

.By .24 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bhogapuram Airport 500 Acres Additional Land,ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. అదనంగా మరో 500 ఎకరాలు, ఉత్తర్వులు జారీ – andhra pradesh government orders on allotted additional 500 acres to bhogapuram international airport
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Bhogapuram International Airport 500 Acres Additional Land: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయానికి అదనంగా 500 ఎకరాల భూమిని కేటాయించింది. గతంలో వెనక్కి తీసుకున్న ఈ భూమిని తిరిగి జీఎంఆర్ సంస్థకు అప్పగించారు. టీడీపీ హయాంలో కేటాయించిన భూమిని జగన్ ప్రభుత్వం తగ్గించింది. విమానాశ్రయ అభివృద్ధికి ఈ భూమి అవసరమని గుర్తించి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వెనుక అసలు కథేంటి? ఈ నిర్ణయం వెనుక ఉన్న మతలబు ఏమిటి?

హైలైట్:

  • ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు అదనంగా భూములు
  • 500 కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • గతంలోనే నమోదు.. తాజాగా భూములు కేటాయింపు
భోగాపురం ఎయిర్‌పోర్టు 500 ఎకరాలు
భోగాపురం ఎయిర్‌పోర్టు 500 ఎకరాలు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్‌పోర్టులపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే కొన్ని విమానాశ్రయాలకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో కీలకమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అదనంగా భూమిని కేటాయించారు. గతంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న 500 ఎకరాల భూమిని తిరిగి జీఎంఆర్ సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో ఈ విమానాశ్రయానికి 2,703.32 ఎకరాలను కేటాయించించింది.. అయితే గత ప్రభుత్వం 500 ఎకరాలను వెనక్కి తీసుకుంది. అయితే ఈ భూమి ఎయిర్‌పోర్టుకు అవసరం కావడంతో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ భూమిని తిరిగి విమానాశ్రయానికి కేటాయించింది.

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి 2022లో 500 ఎకరాలను వెనక్కి తీసుకున్నారు. ఈ భూమి ఎంతో అవసరమని జీఎంఆర్ సంస్థ గత ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జీఎంఆర్ సంస్థ ఆ 500 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విమానాశ్రయ నిర్మాణానికి కేటాయించిన 2,703.32 ఎకరాల్లో కోత విధించిన 500 ఎకరాలను తిరిగి కేటాయించాలని కోరింది. విమానాశ్రయం నిర్మాణ వ్యయం రెట్టింపై రూ.4,600 కోట్లకు చేరిందని జీఎంఆర్ తెలిపింది. ఈ విషయాన్ని పరిశీలించడానికి చంద్రబాబు మంత్రుల కమిటీని నియమించగా.. అనంతరం నివేదికను అందించగా ఆమోదించింది. దీంతో ప్రభుత్వం ఆ 500 ఎకరాలను తిరిగి జీవీఐఏఎల్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పనా శాఖ కార్యదర్శి యువరాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మార్గదర్శకాలు, టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం విమానాశ్రయ నిర్మాణానికి 2,703.32 ఎకరాలు అవసరమని తేల్చారు. అయితే అదనంగా మరో 500 ఎకరాలు కేటాయించారు.. అయితే చంద్రబాబు జీఎంఆర్‌తో కుమ్మక్కై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కుట్ర పన్నారని గత ప్రభుత్వ హయాంలో ఆరోపించారు. ఎయిర్‌పోర్టుకు కేటాయించి భూములు చాలా ఎక్కువగా ఉన్నాయని.. చంద్రబాబు కుమ్మక్కై రియల్‌ ఎస్టేట్‌ చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ భూమిని తిరిగి కేటాయించడంతో జీఎంఆర్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది.

ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. అదనంగా మరో 500 ఎకరాలు, ఉత్తర్వులు జారీ

విమానాశ్రయం అభివృద్ధిలో భాగంగా సిటీ సైడ్ డెవలప్‌మెంట్ చాలా ముఖ్యం. దీని కోసం 500 ఎకరాలను కేటాయించాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం విమానాశ్రయం అభివృద్ధి కోసం 1,733 ఎకరాలు అవసరం. జాతీయ రహదారి నుండి విమానాశ్రయానికి అనుసంధానం కోసం 92 ఎకరాలను ప్రతిపాదించారు. విమానాశ్రయంలో కార్గో ఏరియా కోసం 83.5 ఎకరాలు కేటాయిస్తారు. నార్త్ టెర్మినల్ భవనం కోసం 98 ఎకరాలు, ఎయిర్ పోర్టు బౌండరీ కోసం 494 ఎకరాలను ప్రతిపాదించారు. నివాస ప్రాంతం, ఇతర అవసరాల కోసం 201 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించారు. . ప్రాజెక్టుకు అవసరమైన వయబిలిటీతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడు 500 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Amadalavalasa Coconut Trees Climbing Training,కొబ్బరి చెట్లు ఎక్కేందుకు ప్రత్యేకంగా శిక్షణ.. చెట్టు ఎక్కే మిషన్ కూడా ఉచితంగా ఇస్తారట – srikakulam district amadalavalasa krishi vigyan kendra providing training in climbing coconut trees using a specially made device

10 March 2026

Andhra Pradesh: వైద్యుల అద్భుత ఘనత.. ముక్కలు ముక్కలుగా తెగిపడ్డ చెయ్యిని అతికించిన డాక్టర్లు..!

10 March 2026

Ap Gram Panchayat New Categorization,ఏపీలో పంచాయతీల పునర్ వర్గీకరణ.. మొత్తం 4 కేటగిరీలుగా విభజన, కొత్తగా రూర్బన్‌ పంచాయతీలు – andhra pradesh government approves re categorization of grama panchayats

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Dhurandhar The Revenge: సినిమానే కాదు ట్రైలర్ కూడా రికార్డ్ బ్రేక్ చేసింది..

10 March 2026

రణవీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. హిందీలో విడుదలైన…

Telangana: 10 రోజుల మగ బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎందుకో తెలిసి అధికారులే షాక్..!

10 March 2026

టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?

10 March 2026

Reheating Cooking Oil: క్యాన్సర్‌ అలర్ట్.. ఒకసారి వేడిచేసిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడటం ప్రాణాంతకం!

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Dhurandhar The Revenge: సినిమానే కాదు ట్రైలర్ కూడా రికార్డ్ బ్రేక్ చేసింది..

10 March 2026

Telangana: 10 రోజుల మగ బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎందుకో తెలిసి అధికారులే షాక్..!

10 March 2026

టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.