Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..

15 March 2026

Cinema: 2025లో రిలీజైన పరమ బోరింగ్ సినిమా.. థియేటర్లలో నిద్రపోయిన ఆడియెన్స్.. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీలో..

15 March 2026

అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Srivani Tickets In Adiseshu Rest House,తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ దర్శన టికెట్లు జారీ, కౌంటర్ ఏర్పాటు – ttd decided to set up srivani trust darshan tickets counter near tirumala annamayya bhavan
ఆంధ్రప్రదేశ్

Tirumala Srivani Tickets In Adiseshu Rest House,తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ దర్శన టికెట్లు జారీ, కౌంటర్ ఏర్పాటు – ttd decided to set up srivani trust darshan tickets counter near tirumala annamayya bhavan

.By .24 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Srivani Tickets In Adiseshu Rest House,తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ దర్శన టికెట్లు జారీ, కౌంటర్ ఏర్పాటు – ttd decided to set up srivani trust darshan tickets counter near tirumala annamayya bhavan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Srivani Ticket Counter Near Annamayya Bhavan: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం మారనుంది, ఇకపై మరింత సౌకర్యవంతంగా దర్శనం చేసుకోవచ్చు. రద్దీని తగ్గించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఉచిత దర్శనం టోకెన్ల కోసం ఎదురుచూసే భక్తులకు కూడా మెరుగైన వసతులు కల్పించారు. వేసవి రద్దీలోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. మీ సందేహాలు తీర్చుకోవడానికి ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం కూడా ఉంది. మరిన్ని వివరాల కోసం చదవండి!

హైలైట్:

  • తిరుమలలో దర్శన టికెట్ల కౌంటర్ మార్పు
  • కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ అధికారులు
  • మరో వారంలో కేంద్రాన్ని ప్రారంభించనున్నారు
తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్
తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ కేంద్రాన్ని టీటీడీ అధికారులు మార్చనున్నారు. రద్దీని తగ్గించి, భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ మార్పు చేస్తున్నారు. అదనపు ఈవో కార్యాలయం వెనుక నుంచి అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న భవనంలోకి మారుస్తున్నారు. తిరుమల శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ కేంద్రం ఇంతకుముందు అదనపు ఈవో కార్యాలయంలో ఉండేది. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండేది. వీఐపీ సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులతో ఇబ్బందిగా ఉండేది. అందుకే, శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ కేంద్రాన్ని అదనపు ఈవో కార్యాలయం వెనుక తాత్కాలికంగా జర్మన్ షెడ్లలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిని శాశ్వతంగా అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న భవనంలోకి మారుస్తున్నారు. కొత్త టికెట్ల జారీ కేంద్రంలో క్యూలైన్లు, ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. మరో వారంలో ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, మాధవం భక్తుల వసతి సముదాయం, విష్ణు నివాసంలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. గతంలో భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల కోసం వచ్చిన భక్తులు తోపులాటలో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు నారాయణగిరి తరహాలో శాశ్వత క్యూలైన్ షెడ్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎండ, వాన నుంచి భక్తులకు ఉపశమనం కలుగుతుంది. తిరుమల నారాయణగిరి తరహాలో శాశ్వత క్యూలైన్‌ షెడ్లు ఏర్పాటు చేసి ఎండ, వాన నుంచి ఉపశమనం కల్పించారు. తిరుమలలో ఉన్న నారాయణగిరి క్యూలైన్ల మాదిరిగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు.

‘వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సాధారణంగా రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది. గురువారం నాడు సాధారణంగా కేవలం 62 నుండి 63 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి నేతృత్వంలో, తిరుమలలోని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా తొలిసారి గురువారం నాడు 72,579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు అదనపు ఈవో విశేష కృషి చేసిన అన్ని విభాగాల సిబ్బందిని అభినందించారు’ అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ దర్శన టికెట్లు జారీ, కౌంటర్ ఏర్పాటు

టీటీడీ ఇవాళ ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’ కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తోంది. నేడు ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌లలోని అన్న‌మ‌య్య భవనంలో జరగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జే శ్యామలరావుకు ఫోన్‌ చేసి నేరుగా మాట్లాడి తెలియజేయొచ్చు. భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Annadata Sukhibhava: ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు మీకు పడలేదా..? మార్చి 31లోగా ఈ పని చేస్తే అకౌంట్లోకి వచ్చేస్తాయి..

15 March 2026

భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..

15 March 2026

Andhra: ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్‌కు తీసుకెళ్లి..

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..

15 March 2026

చీకటి పడ్డాక పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న రైతులకు మార్గమధ్యలో ఊహించని దృశ్యం ఎదురైంది. మరో రెండడుగుల దూరం…

Cinema: 2025లో రిలీజైన పరమ బోరింగ్ సినిమా.. థియేటర్లలో నిద్రపోయిన ఆడియెన్స్.. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీలో..

15 March 2026

అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు

15 March 2026

IPL 2026 : ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్? ఈ నలుగురు స్టార్లకు ఇదే ఆఖరి సీజన్

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..

15 March 2026

Cinema: 2025లో రిలీజైన పరమ బోరింగ్ సినిమా.. థియేటర్లలో నిద్రపోయిన ఆడియెన్స్.. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీలో..

15 March 2026

అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.