Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Heatwave Alert: అయ్‌ బాబోయ్‌ మార్చిలోనే మాడు పగిలే ఎండలు..! వసంతకాలం కనుమరుగవుతోందా?

12 March 2026

2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

12 March 2026

శుక్ర గోచారం ప్రభావం: ఈ రాశులకు భారీ ధన లాభం, వాహనం-ఆస్తి యోగం

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ కూడా దర్శన టికెట్లు జారీ, కౌంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ కూడా దర్శన టికెట్లు జారీ, కౌంటర్ ఏర్పాటు

.By .24 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ కూడా దర్శన టికెట్లు జారీ, కౌంటర్ ఏర్పాటు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Srivani Ticket Counter Change In Tirumala: తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా టికెట్లు జారీ చేసే కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. ఆ వెంటనే.. దీని స్థానంలో డీఎఫ్‌వో కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన టికెట్ల జారీ కౌంటర్లు.. 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

తిరుమల ఆదిశేషు రెస్ట్‌ హౌస్‌‌లో దర్శన టికెట్లు
తిరుమల ఆదిశేషు రెస్ట్‌ హౌస్‌‌లో దర్శన టికెట్లు (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. తిరుమలలో శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు. ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ కౌంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు.

ఇందులో భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తిస్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో టికెట్లు జారీ చేయు కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మరోవైపు టీటీడీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1,000కి పరిమితం చేసింది.. వీటిలో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్ లైన్‌లో 250 టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది. ఇప్పటికే టీటీడీ 500 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అదనంగా జనవరి 11న మరో 250 టికెట్లు విడుదల చేస్తారు.

ఇదిలా ఉంటే తిరుమలలోని మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. శ్రీవాణి దాతలకు రేణిగుంట ఎయిర్‌పోర్టులో కరెంట్ బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులో ఉంచారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో బోర్డింగ్ పాస్‌ ద్వారా ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు. అయితే శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్‌కి బోర్డింగ్ పాస్‌ను కూడా జతచేయాలి టీటీడీ సూచించింది. టికెట్‌పై ఎయిర్‌లైన్ రిఫరెన్స్‌తో కూడిన పీఏన్‌ఆర్ నంబర్‌ను కూడా నమోదు చేయించాలని తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సిబ్బంది బ్రేక్ దర్శన టిక్కెట్‌తో పాటు బోర్డింగ్ పాసును తనిఖీ చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.

అంతేకాదు.. తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ తిరిగి ప్రారంభంకానుంది. ఈ సేవను జనవరి 12 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. దీని కోసం భక్తులు తిరుమలలోని సీఆర్వో కౌంటర్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. వీరికి జనవరి 11న సాయంత్రం 5 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 25 టికెట్లు జారీ చేస్తారని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Nellore Court Three Years Jail For A Man For Grow Ganja Trees,పెరట్లో రెండు మొక్కలు పెంచాడు.. మూడేళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు, ఈ కేసు ఓ గుణపాఠం – nellore court three years jail for young man for grow ganja trees in his house

12 March 2026

Chandrababu Registered As Sadhikara Saaradhi,టీడీపీలో చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తే.. కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా బాధ్యతలు – ap cm chandrababu naidu also registered as sadhikara saaradhi in kadapalle panchayat in kuppam

12 March 2026

SBI Fellowship 2026: ఏపీ, తెలంగాణ యువతకు ఎస్బీఐ ఫెలోషిప్‌ ఆహ్వానం.. నెలకు రూ.21 వేలు, రూ.1,10,000 గ్రాంట్ కూడా!

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Heatwave Alert: అయ్‌ బాబోయ్‌ మార్చిలోనే మాడు పగిలే ఎండలు..! వసంతకాలం కనుమరుగవుతోందా?

12 March 2026

న్యూఢిల్లీ, మార్చి 12: ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవి పలకరించింది. మార్చి నెల ఆరంభం నుంచే బాణుడు ప్రతాపం…

2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

12 March 2026

శుక్ర గోచారం ప్రభావం: ఈ రాశులకు భారీ ధన లాభం, వాహనం-ఆస్తి యోగం

12 March 2026

Nellore Court Three Years Jail For A Man For Grow Ganja Trees,పెరట్లో రెండు మొక్కలు పెంచాడు.. మూడేళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు, ఈ కేసు ఓ గుణపాఠం – nellore court three years jail for young man for grow ganja trees in his house

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Heatwave Alert: అయ్‌ బాబోయ్‌ మార్చిలోనే మాడు పగిలే ఎండలు..! వసంతకాలం కనుమరుగవుతోందా?

12 March 2026

2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

12 March 2026

శుక్ర గోచారం ప్రభావం: ఈ రాశులకు భారీ ధన లాభం, వాహనం-ఆస్తి యోగం

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.